అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కొంత మేరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రంలో ముందుగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె ఘోస్ట్ నుంచి తప్పుకుంది. దీంతో కాజల్ స్థానంలో అమలాపాల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే చివరరకు అమలాపాల్ కూడా సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత మేకర్స్ మెహరీన్‌ను సంప్రదించగా, ఆమె భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు మరో హీరోయిన్‌ను వెదికే పనిలో పడ్డారు. చివరకు సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఘోస్ట్ సినిమా కోసం నాగార్జున సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారట. ఇన్నేళ్ల కెరీర్‌లో కనిపించని లుక్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గుబురు గడ్డం, కోర మీసాల లుక్‌లో నాగార్జున కనిపించబోతున్నారని సమాచారం. ఆయన లుక్ ఇదేనంటూ ఓ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున రిటైర్డ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నారు. అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ప్రస్తుతం నాగార్జున తన తనయుడు నాగ చైతన్యతతో కలసి బంగార్రాజుగా ఈ సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tlQXP8
No comments:
Post a Comment