Wednesday, 4 August 2021

MAA Elections: జస్ట్ ఆస్కింగ్.. తెగేదాకా లాగకండి.. మరోసారి మంటపెట్టిన ప్రకాష్ రాజ్!!

ఎప్పటిలాగే 'మా' ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. అయితే ఈ పోటీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు వారి వారసుడు మంచు చేస్తున్న కామెంట్స్ కొత్త చర్చలకు ఊతమిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య లోలోపల వార్ నడుస్తోందని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన ఓ ట్వీట్ మంట పుట్టించింది. తాను 'మా' అధ్యక్ష బరిలో ఉంటున్నానని ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి పరిస్థితులు రచ్చ రచ్చగా మారాయి. లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పుకోవడం చూశాం. దీంతో 'మా' ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి? ఒకవేళ నిర్వహిస్తే ఎలాంటి రచ్చ జరగకుండా ఎలా నిర్వహించాలి అనే దానిపై సినీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు వైపు సీనియర్స్ అంతా కలిసి ఈ సారి మా అధ్యక్ష పదవి ఏకగ్రీవం అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. పెద్దలందరూ ఏకగ్రీవం అని నిర్ణయిస్తే తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటానని తెలపడం సంచలనంగా మారింది. పోటీ అనేది ఉంటే మాత్రం పక్కాగా బరిలో ఉంటానని మంచు విష్ణు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎంటరై తమ కార్యవర్గానికి చట్టబద్దత ఉన్నట్లేనని.. ఎన్నికలు జరిగే వరకు గరిష్ఠంగా ఆరేళ్ల వరకు తమకే అధికారం ఉంటుందని అన్నారు. తాను చెప్పినట్లు జరగకుంటే ఎన్నికలు ఆలస్యమవుతాయన్నట్లుగా ఆయన హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ట్విటర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. 'జస్ట్ ఆస్కింగ్' అనే హ్యాష్ టాగ్ ఉపయోగిస్తూ ‘తెగేదాకా లాక్కండి’ అంటూ సింఫుల్ ట్వీట్ చేసి కొత్త చర్చకు తెరలేపారాయన. దీంతో ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఇది మా ఎన్నికలను ఉద్దేశించే చేసిన పోస్టే అని అంతా అంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnTO3y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....