తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోలు కొందరే ఉంటారు. అందులో ఒకరు . మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కుర్ర హీరో.. మొదటి సినిమాతోనే కలెక్షన్ల ప్రవాహం పారించాడు. అదే ఫామ్‌లో ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకత్వంలో ఆయన చేసిన '' సినిమా విడుదలకు రెడీ అయింది. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ క్రిష్. సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కీరవాణి బాణీలు కట్టారు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'కొండపొలం' రిలీజ్ డేట్‌తో కూడిన అఫీషియల్ పోస్టర్‌తో పాటు వైష్ణవ్ తేజ్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ కనిపించబోతున్నారని డైరెక్టర్ క్రిష్ తెలిపారు. అదేవిధంగా ఈ వీడియో షేర్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సినిమా పట్ల ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నారు. లుక్ పరంగా ఈ సినిమాతో మరోసారి వైష్ణవ్ మ్యాజిక్ రిపీట్ కానుందని ఈ వీడియో చూస్తుంటే స్పష్టమవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3miZkrq
No comments:
Post a Comment