Tuesday, 24 August 2021

మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్.. కొడుకు ముందే భార్యతో ముద్దులు

MAA ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణుతో పోటీ పడుతున్నారు ప్రకాష్ రాజ్. ఇదిలాఉంటే తాజాగా ఆయన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని తెలియజేస్తూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ వయసులో మళ్లీ పెళ్లి ఏంటి?? పైగా ఆ ముద్దులు.. ముచ్చట్లు ఇంత పబ్లిక్‌గా ఏంటి అంటే.. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు తన ముందే ఇలా మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఫొటోలు షేర్ చేశాడు ప్రకాష్ రాజ్. ప్రకాశ్‌రాజ్‌, పోని వర్మను పెళ్లి చేసుకుని 11 వసంతాలు పూర్తకావడంతో.. వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం.. మా పెళ్లికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు... కుటుంబంతో కలిపి జరుపుకున్న వేడుక ఇది’ అంటూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మొదట డిస్కో శాంతి సోదరి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ డాన్సర్ పోనీ వర్మని 2010లో రెండో వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. వీరికి పుట్టిన కొడుకే వేదాంత్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DeuZjK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....