Monday, 23 August 2021

కొండ పొలంలో రకుల్.. మెగా మేనల్లుడుతో కౌగిలిలో అలా..! వీడియో వైరల్

అనే నవల ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'కొండ పొలం'. ఇటీవలే 'ఉప్పెన' సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఆయనతో రొమాన్స్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో షేర్ చేశారు మేకర్స్. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అటవీ నేపథ్యంలో అడ్వెంచరస్‌ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ లుక్స్ కథకు యాప్ట్ అయ్యేలా శ్రద్ధ తీసుకున్నారని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'ఓబులమ్మ'గా బలమైన క్యారెక్టర్ చేస్తోంది రకుల్. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేయగా.. తాజాగా విడుదలైన రకుల్ లుక్ మరింత ఆసక్తి రేకెత్తించింది. నల్లమల అడవిలో సామాన్య గొర్రెల కాపరులు చేసే సాహసోపేతమైన జీవన పోరాటం ఇతివృత్తంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8వ తేదీన థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి బాణీలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. చుడాలి మరి వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yaZZxp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....