సినీ కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఢీ మినహా ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ ఇంత వరకు పడలేదు. మధ్యలో కొన్ని ఓ మోస్తరుగా పర్వాలేదనిపించినా కూడా సూపర్ హిట్లు మాత్రం ఇంత వరకు రాలేదు. చివరగా వచ్చిన మోసగాళ్లు సినిమాతో బోల్తా పడ్డాడు. ఆ సినిమా బడ్జెట్ విషయం కూడా ఎంతటి ట్రోలింగ్‌కు గురయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. అంతలా మంచు విష్ణు సినిమా కెరీర్ పతనమైంది. అయితే ఇప్పుడు మంచు విష్ణు కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఢీ వంటి సినిమాను ఇచ్చిన శ్రీను వైట్లతో కలిసి డబుల్ డోస్ అంటూ రాబోతోన్నారు. ఢీ సినిమాకు సీక్వెల్ కాదని, అసలు దానికి దీనికి ఎక్కడా పొంతన ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇక మంచు విష్ణు సినీ కెరర్ ఈ ప్రాజెక్ట్ మీదే ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు తాజాగా షోకి వచ్చాడు. తన సినిమాల ఎంపిక విషయం, తన దర్శకుల విషయంలో సంచలన కామెంట్స్ చేశారు. ఓ కథ మీరు వినేటప్పుడు ఇది డ్యామ్ షూర్ అనే సినిమాలు ఎన్ని ఉంటాయ్ అని ఆలీ అడిగారు. నా కెరీర్‌లో నేను చేసిన పెద్ద తప్పు.. మంచి దర్శకులను ఎన్నుకోకపోవడం. ఫూలిష్ నెస్, సెంటిమెంటల్ ఫూల్.. అలా నేను చేసినపెద్ద తప్పులున్నాయి. ఓ నాలుగు ఫ్రైడేలకు తప్పులు చేశాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాలు ఏంటి? ఆ దర్శకులు ఎవరు? అనే విషయాలను మంచు విష్ణు రివీల్ చేస్తారో లేదో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xUpeUB
No comments:
Post a Comment