Monday 23 August 2021

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన సలార్ టీమ్ .. భయంకరమైన లుక్‌లో జగపతి బాబు

‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-1’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు . ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనుల్లో అతను బిజీగా ఉన్నాడు. మొదటి ఛాప్టర్ కంటే భారీ రేంజ్‌లో రెండో ఛాప్టర్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత అతను రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్‌ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు ఆయన. ‘సలార్’తో పాటు ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా దాదాపు పూర్తయింది. రెటిరో స్టైల్‌ లైవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దీంతో పాటు రామాయణం ఆధారంగా రూపొందతున్న ‘ఆదిపురుష్’.తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ అనే సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా సలార్ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమా నుంచి స్టైలిష్ విలన్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘రాజమనార్‌’గా కీ రోల్‌లో కనిపించనున్న జగపతిబాబు లుక్‌ను విడుదల చేసింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి బసుర్ సంగీతం అందిస్తున్నారు. ఒకే సారి ప్రభాస్‌ను రెండు విభిన్నమైన గెటప్‌ల్లో ఈ సినిమాలో చూడబోతున్నామనే టాక్‌ కూడా వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3z95r5e

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...