Saturday, 1 May 2021

‘తొక్క, తోటకూర తర్వాత.. అదొక్కటే మనల్ని కాపాడుతుంది..’ ఫ్యాన్స్‌కి రవి బాబు సలహా

కరోనా వైరస్ కారణంగా భారతదేశ వ్యాప్తంగా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడి మరణిస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. సరైన సమయానికి ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని వాళ్లు రక్షించుకోవడమే పరిష్కరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని.. ఒకవేళ వస్తే.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నాయి. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ వ్యాప్తి మరింత భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఒకటికి బదులుగా రెండు మాస్కులు ధరించాలని అధికారులు, వైద్యులు సలహా ఇస్తున్నారు. దీని ద్వారా వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయని వాళ్లు అంటున్నారు. అయితే ఎవరు ఎంత చెప్పినా కానీ, కొందరు మాత్రం తమ ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరగడం.. గుంపుల్లో ఉండటం, భౌతిక దూరం పాటింకపోవడం వంటివి చేస్తూ.. వైరస్ వ్యాప్తి మరింత ఊతమిస్తున్నారు. అలాంటి వారందరికీ అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా దర్శకుడు తన అభిమానులకు ఓ సూచన చేశారు. ప్రతి ఒక్కరు దయచేసి మాస్క్ ధరించాలంటూ ఆయన ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు. చేతులు జోడిస్తూ ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి. మాస్క్ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఈ రెమ్‌డిసివర్, ఆక్సిజన్, తొక్క, తోటకూర అన్ని ఆస్పత్రిలో చేరిన తర్వాత.. ముందు ఆస్పత్రికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకు మాస్క్ ధరించడం ఒకటే మార్గం. ముందు ఒకటి అన్నారు.. ఇప్పుడు రెండు అంటున్నారు. త్వరలో మూడు, నాలుగు కూడా వేసుకోవాలని చెప్పోచ్చు. కానీ, మాస్క్ వేసుకొని మనల్ని మనం మూసుకోకపోతే.. రేపు మనల్ని.. ఇదేసి(దుప్పటి) మూసేస్తారు. మీ ఇష్టం మరి.. మిగితా వాళ్ల కోసం కాదు మిమల్ని మీరు కాపాడుకోవడం కోసం మాస్క్ వేసుకోండి’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nCzYDg

No comments:

Post a Comment

'I Told Shreyas To Shut Outside Noise'

'Shreyas Iyer likes a challenge, tough situations, playing against the top teams.' from rediff Top Interviews https://ift.tt/GpnvH...