Saturday, 1 May 2021

‘రంగస్థలం’ టైమ్‌లో చరణ్ అలా చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.. అనసూయ కామెంట్స్

సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా ఓ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా రంగమ్మత్త పాత్రలో నటి భరద్వాజ్ తన నటనతో అందరినీ మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు రంగమ్మత్త అనే పేరు పర్మనెంట్‌గా మారిపోయింది. అంతలా ఈ పాత్రలో జీవించింది అనసూయ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ రంగస్థలంలో షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను బయటపెట్టింది. రంగస్థలం షూటింగ్ సమయంలో అనసూయ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా చెఫ్‌ను పిలిపించి వంట చేయించేవాడట. సెట్లో భోజనం సమయానికి చేపల కూర రెడీగా ఉండేది.. కానీ అనసూయకు తినే అలవాటు లేకపోవడంతో.. రామ్ చరణ్ తన చెఫ్‌ని పిలిపించి ఆమె కోసం పన్నీర్‌ను పెద్ద ముక్కలుగా కట్‌ చేసి కూర వండించాడట. అది అచ్చం చేపల కూరలా చాలా రుచిగా ఉండేది అని ఆమె తెలిపింది. అయితే రామ్ చరణ్‌కి అలా చేయాల్సిన అవసరం లేదని.. కానీ తన కోసం చెఫ్‌తో ప్రత్యేకంగా అలా వంట చేయించడం తనకు ఎంతో సంతోషం అనిపించింది అని ఆమె పేర్కొంది. ఇక అనసూయ ప్రస్తుతం ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె గర్భవతి పాత్ర పోషిస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది. దీంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e7XuoT

No comments:

Post a Comment

'Aamir Rushed Me To Hospital'

'I couldn't see the injury but I knew it was bad from the expression on Aamir's face.' from rediff Top Interviews https://...