Sunday, 21 February 2021

‘నేను లోకల్’ డైరెక్టర్‌తో రవితేజ 68వ సినిమా

‘క్రాక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ తన తరవాత ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ‘ఖిలాడి’ సినిమాను సిద్ధం చేస్తున్న రవితేజ.. ఇప్పుడు రాబోయే తన మరో సినిమాను రవితేజ ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి హిట్ చిత్రాల ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్యవహ‌రిస్తున్న ఈ మూవీకి ప్రస‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే ఇతర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వర‌లో వెల్లడించ‌నున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌లైన ‘క్రాక్‌’తో బ్లాక్‌బ‌స్టర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ర‌వితేజ త్వర‌లో ‘ఖిలాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఖిలాడి’ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k9xz1e

No comments:

Post a Comment

Why Pakistan Has Launched A War Against Afghanistan

'Islamabad feels it has no alternative, but to address the challenges from the Afghan-Taliban through an open war.' from rediff To...