Sunday, 21 February 2021

పెళ్లయ్యాక నితిన్ స్పీడు పెంచాడు.. మాకు చెక్ పెట్టాడు: వరుణ్ తేజ్

యూత్‌ స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. అలాగే, స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో లాయర్‌గా కీలక పాత్ర పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే దర్శకులు వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ హీరో నితిన్‌పై సరదాగా సెటైర్లు వేశారు. పెళ్లయ్యాక నితిన్ మరింత స్పీడు పెంచాడని అన్నారు. ‘‘రాజమౌళి గారి గురించి మాట్లాడే అవకాశం ఇప్పటి వరకు నాకు రాలేదు. ఆయనతో తొలిసారి వేదికను పంచుకోవడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. స్కూల్ డేస్ నుంచి మీ సినిమాలు చూశాను సార్. మీకు నేను పెద్ద అభిమానిని. కలలు పెద్దగా కనాలని మీరు అందరికీ సూచించారు. మీ వల్లే ఇండస్ట్రీలో అందరూ పెద్దగా కలలు కంటున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నాను. ఆ క్రెడిట్ అంతా మీకే సార్’’ అని జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించారు వరుణ్. సాధారణంగా పెళ్లయిన తరవాత ఎవరైనా కాస్త స్లో అవుతారని.. కానీ, నితిన్ స్పీడు పెంచాడని.. నాలుగు సినిమాల డేట్లు కూడా ప్రకటించి అందరికీ చెక్ పెట్టాడని అన్నారు వరుణ్ తేజ్. ‘‘నితిన్.. మరీ టూ మచ్. ట్రాఫిక్ ఎక్కువ చేశావ్’’ అంటూ వరుణ్ జోకులు వేశారు. ఏడాదిన్నర క్రితం తనను కలిసినప్పుడు ‘చెక్’ సినిమా స్టోరీ తనకు నితిన్ చెప్పాడని వరుణ్ అన్నారు. ఈ సినిమాపై నితిన్‌కు ఎంతో నమ్మకం ఉందని.. అది కచ్చితంగా నిజమవుతుందని వరుణ్ ఆకాంక్షించారు. చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qHwjFc

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8