సరిగ్గా చెప్పిన సమయానికే తన సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. నేడు (ఆగష్టు 18) ఉదయం 07:11 గంటలకు తన కొత్త సినిమాను ప్రకటించి రెబర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ‘బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అఫ్ ది డికేడ్’ అని చెబుతున్న ఈ ప్రకటనను ప్రేక్షకుల ముందుంచారు. రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిన్న వెల్లడించిన ప్రభాస్.. భారీ ప్రకటన చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అప్పటినుంచి ప్రభాస్ కోసం బడా దర్శకనిర్మాతలు క్యూ కట్టడం, బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయడం జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో భారీ బాలీవుడ్ సినిమా ప్లాన్ చేశారు. అదే ''. ఈ సినిమానే తాజాగా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రకటించారు ప్రభాస్. ''చెడుపై మంచి సాధించే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం'' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. Also Read: ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా ఈ ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తన 20వ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ప్రభాస్.. 21వ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలు కూడా స్టోరీ పరంగా దేనికవే ప్రత్యేకం అని తెలుస్తుండటం రెబర్ స్టార్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని ఉరకలేపిస్తోంది. సో.. చూస్తుంటే రెబల్ స్టార్ మరిన్ని అరుదైన రికార్డ్స్ కొట్టేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది కదూ!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/344CaMi
No comments:
Post a Comment