సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాతో ఆయన కెమెరా ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నేడు (ఆగస్టు 17) నిధి 27వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. Also Read: ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది నిధి అగర్వాల్. పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్‌తో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై అందాలు ఆరబోయనుందని ఈ పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు పద్మావతి గల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నరేష్, సత్య, అర్చన సౌందర్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ అతిత్వరలో తిరిగి ప్రారంభం కానుంది. చిత్ర టైటిల్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనుందట చిత్రయూనిట్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kPZoeY
No comments:
Post a Comment