డాషింగ్ డైరెక్టర్ అనే నూతన మార్గం ద్వారా సమాజంలోని పరిణామాలపై స్పందిస్తూ నోరు విప్పుతున్నారు. సినిమాల పరంగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా కీర్తి గడించిన పూరి.. ఈ సమాజంపై, సమాజంలోని వ్యక్తులపై తన అభిప్రాయాలను చెప్పడంలోనూ అంతే ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సొంత వాయిస్‌తో పూరి చేస్తున్న ఈ పోడ్‌కాస్ట్ ఆడియో సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోడ్‌కాస్ట్ ఆడియోలో ఆడవాళ్లపై, ఈ సమాజం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు పూరి. ఆడదానిలో ఆలోచనలు రేకెత్తిస్తూ స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడారు. వెయ్యేళ్ళ భారతీయ చరిత్రను తవ్వుతూ సెన్సేషనల్ విషయాలు బయటపెట్టారు. పూర్వం ఉన్న మాతృస్వామ్య వ్యవస్థ మొదలుకొని సతీసహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం.. ఇలా నేటి కాలంలో మహిళలపై జరుగుతున్న రేప్ దుర్ఘటనల వరకు ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రముఖ లీడింగ్ మీడియా కథనం రాయగా అది చూసిన హీరోయిన్ తన ఫేస్‌బుక్ వేదికగా వ్యక్తిత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read: ''జగన్.. నిన్ను 2007లో కలిశాను. అప్పుడు ఇప్పుడు సగటు స్త్రీ గురించి అవే మాటలు. అందుకే నువ్వు ఎప్పటికీ నా ఫేవరేట్ పర్సన్. నేను కలిసిన సమయంలో నన్ను ఎలా ట్రీట్ చేశావో ఇప్పటికీ గుర్తుంది. కాఫీ తాగు, నూడిల్స్ తిను, కుక్క పిల్లలతో ఆడుకో, మూవీస్ చూస్తావా అంటూ నన్ను చిన్నపిల్లలా చూసుకున్నారు. మీ ఆఫీస్‌కి వచ్చినా ఇంట్లో పిల్లలా చూసావ్.. మొదటి సారి మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్‌కి వచ్చాను. కానీ నన్ను ఫ్రెండ్‌లా మధు అంటూ మీ ఇంట్లో అమ్మాయిని చూసినట్లు చూసావ్. అందుకే నాకు మూవీ ఆఫర్ ఇవ్వకపోయినా ఫీల్ కాలేదు. నువ్ అప్పుడూ, ఇప్పుడూ సేమ్.. ఓపెన్ మైండెడ్ పర్సన్. ఈ సొసైటీ ఎలా ఉంటుందో నీ మూవీస్‌లో చుపిస్తావ్ అలాగే సొసైటీలో ఆడదాని బతుకేంటో మాటలతో చెబుతావ్. అందుకే ఎవరేమనుకున్నా నాకు అవకాశం ఉన్న ప్రతిచోటా జగన్ చాలా మంచివాడనే చెబుతా. మంచోడు ఆమె పదం నీకు నచ్చదని తెలుసు.. అయినా స్త్రీని ఉద్దేశిస్తూ నీవు చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతాగానో ఆకట్టుకున్నాయి. నిన్ను, నీ మాటలను గౌరవిస్తున్నా. అయితే నిజానికి ఈ మాటలను డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు కామెంట్స్ చేస్తారు. ఇప్పటికీ ఇదే సమాజం. ఇదే నిజం.. ఇదే నిజం. బలై పోతున్న నా ఫ్రెండ్స్ జీవితాలే సాక్షం'' అని పేర్కొంది మాధవీలత.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/316pTFi
No comments:
Post a Comment