Sunday, 16 August 2020

హాట్ టాపిక్: రాజకీయాల్లోకి స్టార్ హీరో విజయ్! కన్ఫర్మ్.. సొంత పార్టీతోనే రంగంలోకి

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశం దిశగా అడుగులేస్తున్నారట. రాబోయే ఎన్నికలు టార్గెట్‌గా విజయ్ రణరంగంలోకి దూకబోతున్నారనే వార్త తమిళ సినీ, రాజకీయ వార్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజులుగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించిన చర్చలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మరోవైపు ప్రస్తుత రాజకీయాలను టార్గెట్‌ చేసుకొని తన సినిమాల్లో విజయ్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక, ఆయన పొలిటికల్ ఎంట్రీ వార్తలకు బలాన్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. Also Read: అయితే ఏ ఇతర పార్టీ తరపున కాకుండా సొంతంగా పార్టీ నెలకొల్పి పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చిన విజయ్.. ఆ దిశగా అడుగులేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారని కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగి అన్నీ చూసుకుంటున్నారని అంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి విజయ్ వర్గాలు సిద్దమయ్యాయనేది లేటెస్ట్ టాక్. కాగా.. ఇటీవల విజయ్ ఇంటిపై జరిగిన ఐటీ రైడ్స్‌ జరగడం, ఆ తర్వాత ఇంట్లో బాంబు ఉందంటూ కొంతమంది ఆకతాయిలు కలకలం సృష్టించడం లాంటి పరిణామాలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ అంశం మరింత హాట్ ఇష్యూగా మారింది. చూడాలి మరి దీనిపై హీరో విజయ్ వర్గాలు స్పందిస్తాయా.. లేదా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g0WZKY

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr