Monday, 17 August 2020

బోరున ఏడ్చిన నిహారిక.. పురిటిలోనే చనిపోయిన జానీ మాస్టర్ కూతురు.. భావోద్వేగ సన్నివేశం

ఫాదర్-డాటర్ రిలేషన్ చాలా ఎమోషన్. కూతురు పుట్టింది మొదలు ప్రతిక్షణం ఆ తండ్రి జీవితంలో ఓ మధురానుభూతి. పంచప్రాణాలుగా పెంచిన కూతుర్ని ఒక ఏజ్ వచ్చేసరికి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇంటి నుంచి పంపేయడం ప్రతి తండ్రి కళ్లు చెమ్మగిల్లే సందర్భం ఇది. విచిత్రం ఏంటంటే అదే సందర్భంలో కూతురికి మంచి జీవితాన్ని ఇచ్చానని ఆత్మసంతృప్తి కూడా ఆ తండ్రి సొంతం. ఇక ప్రతి కూతురుకూడా నాన్నకూచిలుగానే ఉంటారు. తన తండ్రిని ఒక్కమాట అంటే అమ్మతో అయినా గొడవపడేందుకు రెడీగా ఉంటారు. నాన్న అంటే కూతురికి రక్షణ.. సంరక్షణ.. ఎవ్రీథింగ్. వీళ్ల మధ్య ఉండే అనుబంధం భావోద్వేగాల కలబోత. అలాంటి కూతురు శాశ్వతంగా దూరమైంది అని తెలిస్తే.. ఏ తండ్రి గుండె తట్టుకోలేదు. ఎంత అల్లాడిపోతుందో తాను అనుభవించాని చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేలా చేశారు ప్రముఖ కొరియోగ్రాఫర్ . బుట్టబొమ్మ, జిగేల్ రాణి వంటి సూపర్ హిట్ సాంగ్స్‌కి అదిరి స్టెప్పుల్ని కంపోజ్ చేసిన జానీ మాస్టర్ తాజాగా ‘బాపు బొమ్మకి పెళ్లంట’ అనే కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చి తన లైఫ్‌లో జరిగిన విషాద ఘటనను షేర్ చేసుకున్నారు. వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో ఆగష్టు 23న ‘బాపు బొమ్మకి పెళ్లంట’ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండగా.. మెగా డాటర్ పెళ్లి కాన్సెప్ట్‌లో భావోద్వేగంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో నిహారిక, నాగబాబులతో పాటు జానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రదీప్, భాను శ్రీ, యామమ్మ రాజు, అదిరింది కమెడియన్స్ ఇలా చాలా మంది పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని తెలియజేస్తూ ఒక స్కిట్‌ను ప్రదర్శించగా.. దాన్ని చూసి ఎమోషన్ అయ్యారు జానీ మాస్టర్. ‘ఫస్ట్ బాబు కావాలనుకున్నాను.. పుట్టాడు. ఆ తరువాత కంప్లసరీ పాపే కావాలనుకున్నాను. నా భార్యకు మూడు నెలలు ఉండగా.. నేను ఆలియా అని పిలిచేవాడ్ని.. ఆ పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి ఆమె కడుపులో కదులుతూ ఉండేది.. ఆ పేరుకి స్పందించేది. కాని ఆరునెలలు అయ్యే సరికి డాక్టర్లు సారీ సార్ అనేశారు. ఏమైంది అంటే.. పాప కడుపులోనే చనిపోయింది అన్నారు. ఆ బిడ్డను బయటకు తీసిన తరువాత ఎత్తుకుని ఆలియా.. ఆలియా గట్టిగా అరిచాను.. కాని నా కూతురు స్పందించలేదు (ఏడుస్తూ).. కాని ఆ తరువాత మళ్లీ నాకు పాప పుట్టింది. ఆమె పేరే నా ఆలియా’ అంటూ కూతుర్ని ముద్దాడుతూ కనిపించారు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ ఈ విషాద ఘటనను షేర్ చేసుకుంటుండగా.. మెగా డాటర్ నిహారిక సైతం బోరున ఏడ్చేసింది. ఆమెతో పాటు అనసూయ, నాగబాబు, ప్రదీప్ అందరి కళ్లు చెమ్మగిల్లేలా చేశారు జానీ మాస్టర్. ఇక ఇదే ప్రోమోలో నిహారిక చిన్నప్పుడు న్యూజిలాండ్‌లో తప్పిపోతే.. తాను లేకుండా బతకలేనని భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానంటూ ఆ ఇన్సిడెంట్‌ను షేర్ చేసుకున్నారు నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ecbka2

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk