తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నారు. ఇప్పటికే ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ప్రారంభం కాగా.. బస్సులు, ట్రైన్‌లు తిరగడం ప్రారంభమయ్యాయి. ఇక దాదాపు రెండు నెలలుగా సినిమా, సీరియల్ షూటింగ్‌లు సైతం ఆగిపోవడంతో సెలబ్రిటీలు, సినీ కార్మికులు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఏపీలో సింగిల్ విండో పద్దతిలో షూటింగ్‌లకు అనుమతి లభించగా.. తెలంగాణలో త్వరలో షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. గురువారం నాడు సినీ పెద్దలు చిరంజీవి నివాసంలో మంత్రి తలసానిపై సమావేశమ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి లభించగా.. మరో రెండు మూడు రోజుల్లో సినిమా, సీరియల్ షూటింగ్‌లు ప్రారంభించేదుకు చర్చలు జరుగుతున్నాయి. అయితే దాదాపు షూటింగ్‌లు ప్రారంభం కావడం ఖాయం కావడంతో సినీ, సీరియల్ నటీనటులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆటో రాం ప్రసాద్‌కి కరోనా నిబంధనల్లో భాగంగా గురువారం నాడు కోదాడలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కమెడియన్ రామ్ ప్రసాద్ కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. కోదాడ నల్లబండగూడెంలోకి రామాపురం క్రాస్ రోడ్డు సరిహద్దు వద్దు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ కేంద్రంలో రాం ప్రసాద్‌కి వైద్య పరీక్షలు జరిపి... కరోనా వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా లాక్ డౌన్ నిబంధనల్ని అనుసరించి హౌస్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా రామ్ ప్రసాద్‌ని కోరారు వైద్యులు. రాం ప్రసాద్‌తో పాటు మరికొంత మంది కూడా షూటింగ్‌ల నిమిత్తం హైదరాబాద్‌కి చేరుకుంటున్నారు. అయితే బయట ప్రాంతాల నుంచే వచ్చే అందర్నీ హౌస్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పోలీసులు, వైద్యులు సూచిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LRjtBu
No comments:
Post a Comment