Thursday, 21 May 2020

ఇదే కరెక్ట్ అంటున్న నాగబాబు.. సోషల్ మీడియాలో మరో పోస్టు

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా సంచలన పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరో పోస్టు పెట్టారు నాగబాబు. నాగబాబు ఇటీవల గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన ట్విట్టర్‌ ఖాతాలో ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సత్యం వద ధర్మం చర.. అంటే (speak the truth.. live the righteous life) నిజం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి అని అర్థం. కానీ, ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట.. సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైనది అన్నారు. వ్యంగ్యంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది' అని నాగబాబు ట్వీట్ చేశారు. తను ఇటీవల చేసిన ట్వీట్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయన నాగబాబు ఈ విధంగా పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మే 19న మహాత్మా గాంధీని చంపి నాథురాం గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా చేశారు. ‘ ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. గాడ్సేపై నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కాక రేపాయి. కొందరు మద్దతిచ్చినా.. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా గాంధేయవాదులు నాగబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తన మాటలపై ఆయన వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం జాతిపితను కించపర్చడం కాదని స్పష్టత ఇచ్చినప్పటికీ.. కొందరు ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్‌ బుధవారం నాగబాబుపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నాగబాబుపై కేసు నమోదు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3e6mTME

No comments:

Post a Comment

'Kohli, Rohit Also Need A Pat Sometimes'

'What is the use of talent if that player plays so many Tests and averages below 35 after a few years of being in the Indian team?' ...