Monday, 31 January 2022

మాల్దీవుల్లో మాళవికా మోహనన్ అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫొటోలు

మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటుంది. ఎందుక‌నో ఆమె తెలుగులో మాత్రం క‌నిపించ‌డం లేదు. మ‌రి తెలుగులో అవ‌కాశాలు రావ‌డం లేదో, లేక వ‌చ్చినా చేయ‌డం లేదో తెలియ‌డం లేదు. సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఈమె త‌ర్వాతే ఎవరైనా అనేంత‌గా హాటు అందాల‌తో ఈమె సోష‌ల్ మీడియాలో కుర్ర కారుని రెచ్చగొడుతుంది. ఇప్పుడు మాళ‌వికా మోహ‌నన్ మాల్దీవుల్లో విహార యాత్ర చేస్తూ బిజీగా ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా ఆమె స్విమ్ సూట్ వేసుకుని నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. 2013లో ప‌ట్టం పోలే అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీస‌కుని నిర్ణ‌యాకం అనే మ‌రో మ‌లయాళ సినిమాలో యాక్ట్ చేసింది. త‌దుప‌రి నాను మ‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి అనే క‌న్న‌డ సినిమాలో సంద‌డి చేసింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన‌ పేట‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా చేసిన మాస్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. ధ‌నుష్‌తో చేసిన మార‌న్ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. ఇక‌ బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్‌, యుద్ర సినిమాల్లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/AhTWaowek

Must Read! The Sudha Bharadwaj Interview

'I was told to go to the next room and strip -- that's when it really hits you for the first time... that you are a criminal and you are being treated like one.'

from rediff Top Interviews https://ift.tt/XT9OIkBbN

PlayStation-Maker Sony to Buy Halo-Creator Bungie for $3.6 Billion

PlayStation maker Sony announced a $3.6-billion (roughly Rs. 26,830 crore) agreement to buy US video game studio Bungie, creator of hits like Halo and Destiny, as a gaming industry battle heats up...

from NDTV Gadgets - Latest https://ift.tt/ohS3CImW1

'Omicron is not the end of the pandemic'

'The pandemic ends only when 70 per cent of the world is vaccinated with two doses.'

from rediff Top Interviews https://ift.tt/5bUiKBxp8

Elden Ring to Horizon Forbidden West: Games to Play in February

February is nearly here and gamers can look forward to several titles including Elden Ring, Horizon Forbidden West, Dying Light 2 Stay Human, CrossfireX, Destiny 2 The Witch Queen, Grid legends, The...

from NDTV Gadgets - Latest https://ift.tt/sdyCrB82J

Looop Lapeta, Space Force, The Fame Game, and More on Netflix in February

Looop Lapeta, The Fame Game (Finding Anamika), Space Force season 2, Raising Dion season 2, Love Is Blind season 2, Vikings: Valhalla, Inventing Anna - the biggest original movies, TV shows, and web...

from NDTV Gadgets - Latest https://ift.tt/rgmifYBJS

Pushpa Bollywood Collections : హిందీలో అల్లు అర్జున్ ‘పుష్ప‌’ రికార్డ్‌.. త‌గ్గేదే లే అంటున్న ఐకాన్ స్టార్‌!

ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సాధించిన స‌క్సెస్‌తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నారు. ఇక పుష్పరాజ్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 300 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించింది. ముఖ్యంగా దక్షిణాది కంటే బాలీవుడ్‌లో పుష్ప సినిమా .. క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంలో స‌క్సెస్ కావ‌డం గొప్ప విష‌యం. ఎందుకంటే విడుద‌లైన రోజు అంటే డిసెంబ‌ర్ 17న బాలీవుడ్‌లో సినిమా మూడు కోట్ల రూపాయ‌ల పైచిలుకు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇది చాలా త‌క్కువ‌. ఇంకేముంది సినిమా పోయిన‌ట్లేన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే పుష్ప ది రైజ్ రోజు రోజుకీ వ‌సూళ్ల‌ను పెంచుకుంటూ వ‌చ్చింది. ఇప్పుడు రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోవ‌డం అనేది బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్‌. ఇక ద‌క్షిణాది నుంచి హిందీలోకి డ‌బ్బింగ్ అయ్యి వంద కోట్ల రూపాయ‌ల మార్కును చేరుకున్న చిత్రాల్లో పుష్ప ది రైజ్ ఐదో స్థానాన్ని ద‌క్కించుకుంది. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయ‌ల సాధించి ద‌క్షిణాది సినిమాల లిస్టు చూస్తే... 1. బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ - రూ. 510.99 కోట్లు2. 2.0 - రూ.189.55 కోట్లు3. సాహో - 142.95 కోట్లు4. బాహుబ‌లి ది బిగినింగ్ - 118.70 కోట్లు5. పుష్ప ది రైజ్ - 100.38 కోట్లు వ‌చ్చాయి. పుష్ప ది రైజ్‌కి కొన‌సాగింపుగా రూపొంద‌నున్న పుష్ప ది రూల్ చిత్రం ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి రెగ్యుల‌ర్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా వ‌చ్చింది. సునీల్‌, అన‌సూయ, ధ‌నంజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/g7VdxBhNG

Sunday, 30 January 2022

Top Medium-of-Exchange Cryptos for 2022

Medium-of-Exchange Cryptos are those that can be used to buy and sell stuff (physical or virtual) or which can quickly be converted to "cash". The top six cryptocurrencies leading this category are...

from NDTV Gadgets - Latest https://ift.tt/cgtiNkPl1

Bheemla Nayak : ప‌వ‌న్‌గారూ! ద‌య‌చేసి అది నిరూపించండి.. క‌న్నీటితో రామ్ గోపాల్ వ‌ర్మ రిక్వెస్ట్‌!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప్రశ్నించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత గొప్ప‌గా మరొక‌రు వాడుకోవ‌డం లేదంటే అందులో అతిశ‌యోక్తి లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్‌లో ప్ర‌శ్న‌ల‌డ‌గ‌డం, యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేయడం, టీవీల్లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటి చేసిన వ‌ర్మ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన పంథాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని గిల్లిన‌ట్లు వ‌ర్మ ట్వీట్స్ చేస్తుంటారు. అదేంటి? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నేను మెగా ఫ్యామిలీకి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమాని అంటూ బ‌దులిస్తారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌లా ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారో లేక రిక్వెస్టులు చేస్తున్నారో తెలియ‌న‌ట్లు కొన్ని ట్వీట్స్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు.. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేం. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్‌కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ? ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారూ? ’’ అని ట్వీట్స్ చేశారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ రియాక్ట్ కారు. మ‌రి భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/S6zFurCVp

'Whenever people see me, they say, 'CREDwala aa gaya'

'What I love about Parsis is that we never take anything seriously.'

from rediff Top Interviews https://ift.tt/kqYFioCP7

'Modi wants to raise standard of living'

'So you have welfare programmes, you reach out to the poor, you cut out the middlemen, you cut out the leakages and you try to raise the standard of living.'

from rediff Top Interviews https://ift.tt/tfx2lkb6H

Darshanam Mogilaiah : పవన్ కళ్యాణ్‌ని గుర్తించ‌ని మొగిల‌య్య‌.. ప‌వ‌ర్ స్టార్‌ రియాక్ష‌న్ ఏంటంటే?

గ‌ణ తంత్ర వేడుక‌లకు ముందు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిల‌య్య కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. కిన్నెర 12 మెట్ల ఆఖ‌రి త‌రం క‌ళాకారుడైన మొగిల‌య్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌గు రీతిలో గౌర‌వించుకుంది. ఆయ‌న‌కు ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇత‌ర ఖ‌ర్చుల‌కు కోటి రూపాయ‌ల‌ను సీఎం కేసీఆర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అంత‌కు కొన్నాళ్లు ముందు మొగిల‌య్య‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ‘భీమ్లా నాయ‌క్‌’లో టైటిల్ సాంగ్‌ను పాడించుకున్నారు. ఆర్థికంగా స‌పోర్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో పాట పాడినందుకు మొగిల‌య్య‌కు చాలా మంచి గుర్తింపు వ‌చ్చింద‌న‌డంలో సందేహం లేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, ‘భీమ్లా నాయ‌క్’ సినిమా గురించి.. అందులో పాట పాడిన సంద‌ర్బం గురించి మొగిల‌య్య ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు.‘‘ పీఏ నాకు ఫోన్ చేసి ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మీతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అన్నారు. నేను కూడా స‌రేన‌ని అన్నాను. అప్పుడు ఆయ‌న భీమ్లా నాయ‌క్ షూటింగ్‌లో ఉన్నారు. న‌న్ను ఆ లొకేష‌న్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ కోలాహ‌లంగా ఉంది. పెద్ద ఇల్లు లాంటి వాహ‌నం ఉంది. అందులో నుంచి కాసేప‌య్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కిందికి దిగారు. ఆయ‌న బూట్లు, సూట్లు వేసుకోలేదు. తెల్ల పైజ‌మా వేసుకున్నారు. ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని నాకు తెలియ‌దు. నేను గుర్తు ప‌ట్ట‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సూటు, బూటు వేసుకుని ఉంటార‌ని నేను అనుకున్నాను. కానీ ఆయ‌న చాలా సింపుల్‌గా ఉన్నారు. ఆయ‌న రాగానే న‌మ‌స్కారం మొగిల‌య్య‌గారు అన్నారు. నేను ఎవ‌రో నాకు న‌మ‌స్కారం చేస్తున్నార‌ని అనుకుని నేను కూడా న‌మ‌స్కారం పెట్టాను. త‌ర్వాత ప‌క్క‌నున్న పీఏ ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు అనగానే ఆశ్చ‌ర్య‌పోయాను. సార్‌.. మిమ్మ‌ల్ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాను అని అప్పుడు అన్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు నాతో బాగా మాట్లాడారు. మా సినిమాలో పాట ఉంది పాడుతారా? మొగిల‌య్య‌గారు అన్నారు. పాడుతానండి అన్నాను. త‌ర్వాత న‌న్ను వాళ్లు హోటల్‌కి తీసుకెళ్లారు’’ అంటూ పవన్‌ను క‌లిసిన సంద‌ర్భంగా గురించి మొగిల‌య్య చెప్పుకొచ్చారు. అలా తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూసిన‌ప్పుడు తాను ఎందుకు ఆయ‌న్ని గుర్తు ప‌ట్ట‌లేదు అనే విష‌యాన్ని విష‌యాన్ని ద‌ర్శ‌నం మొగిల‌య్య ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొగిలయ్య పాట పాడిన భీమ్లా నాయ‌క్ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Ojgvktlh

న‌టిస్తున్నందుకు త‌న‌ను తాను ఆస‌హ్యించుకున్న హీరోయిన్‌!

సాధార‌ణంగా బుల్లి తెర‌, వెండి తెర‌పై న‌టిగా మెరిసి పోవాల‌ని కావాల్సినంత గుర్తింపు రావాలని ఎవ‌రైనా కోరుకుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం త‌న‌ను తాను ఆస‌హ్యించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. అవికా గోర్‌. ఈమె బాలికా వ‌ధు అనే సీరియ‌ల్ ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. ఈ సీరియ‌ల్ స‌క్సెస్ కావడంతో దీన్ని చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డ‌బ్బింగ్ చేసి తెలుగులోనూ ప్ర‌సారం చేశారు. ఇక్క‌డ కూడా ఆ సీరియ‌ల్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా అవికా గోర్‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ గురించి మాట్లాడుతూ ఆ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో తానంత హ్యాపీగా లేన‌ని, ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని తాను ఆస‌హ్యించుకున్నా అని తెలియజేసింది. అంతే కాదండోయ్ స్క్రీన్‌పై చ‌క్క‌గా క‌నిపిస్తున్నానా..లేదా? అనే విష‌యాన్ని కూడా ప‌ట్టిచుకునే దాన్ని కాన‌ని ఆమె తెలియ‌జేసింది. త‌ర్వాత ఈమె ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో ఆమెకు అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. అయితే గ్లామ‌ర్ రోల్స్‌కు ఆమె నో చెప్ప‌డ‌మో ఏమో కానీ.. కొన్ని సినిమాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో ఫిల్మ్ కోర్సు చేయ‌డానికి ఆమె కొన్ని రోజులు సినిమాల‌కు కూడా దూర‌మైంది. అదే స‌మ‌యంలో చ‌బ్బీగా ఉండే ఆమె బ‌రువు త‌గ్గి కాస్త స‌న్న‌బ‌డింది. రాజుగారిగ‌ది 3 చిత్రంతో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించారు అవికాగోర్‌. సామాజిక కార్యకర్త, ఎన్జీఓను నిర్వహిస్తున్న మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో తాను లేనని అవికా గోర్ చెప్పింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7ajKBuri9

Budget: 'Big challenge is inflation'

'The robust tax collections give the finance minister a fair amount of headroom for an expansionary fiscal policy.'

from rediff Top Interviews https://ift.tt/Q1UVR5Pqb

డిజిట‌ల్ ఎంట్రీకి ర‌కుల్ ప్రీత్ సింగ్ రెడీ.. కానీ కండీష‌న్ ఏంటంటే?

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు మ‌న స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరోలు, హీరోయిన్సే కాదు.. స్టార్ టెక్నీషియ‌న్స్‌, నిర్మాణ సంస్థ‌లు అన్నీ డిజిటల్ వైపుకు చూస్తున్నారు. ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్స్ సైతం ఓటీటీల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి వారు ఓటీటీల్లో అడుగు పెట్టేశారు. వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలు, వంట‌ల ప్రోగ్రామ్స్ చేసి అంద‌రినీ అల‌రించేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టేయ‌డానికి రెడీ అంటోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా? ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ‘‘ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. బాహుబ‌లి సినిమా వ‌ల్ల పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర సినిమాల ప‌రంగా భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌టం లేదు. కంటెంట్ బావుంటే చాలు. అంద‌రూ చూస్తున్నారు. డిజిట‌ల్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. నేను కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో న‌టించానికి రెడీ. అయితే నా పాత్ర ప్ర‌ధానంగా ఉండాలి. క‌థ‌ను న‌డిపించాలి. కంటెంట్ ఆస‌క్తిక‌రంగా, ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌రి ర‌కుల్‌కి డిజిట‌ల్ ఎంట్రీకి ఏ నిర్మాత అవ‌కాశం ఇస్తారో చూడాలి మ‌రి. ద‌క్షిణాదిన ఇటు తెలుగు, అటు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమెకు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా ఉంటుంది. సినిమాలు కాకుండా ఎఫ్ 45 అనే జిమ్స్ నిర్వ‌హ‌ణ‌తో ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ బిజీగా ఉంటుంద‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌కుల్‌, జాకీ భ‌గ్నానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో కెరటం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. నాగార్జున‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్, నాగ చైత‌న్య‌ చూద్దాం వంటి స్టార్స్‌తో ఈమె న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mu4b1ZkDx

Saturday, 29 January 2022

Things to Consider While Choosing Gear for Wildlife Film-Makers

Wildlife films as seen and experienced by people on TV are made by extremely sophisticated and expensive equipment. When your subjects are out of your control, the cameraperson and the gear have to be...

from NDTV Gadgets - Latest https://ift.tt/BbwQi7AId

నాపై అలాంటి ప్రచారం జరిగింది.. చాలా బాధపడ్డా: కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. కొందరికి తొలి సినిమాతోనే దక్కే క్రేజ్ ఇంకొందరికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దరిచేరదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాక అప్పుడు విజయం వరిస్తుంది. ఇది చాలామంది తారల కెరీర్‌లో అప్లై అయింది. అదే లిస్టులో ఉంది సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ . 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి. దీంతో దెబ్బకు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలతో అలరిస్తున్న ఆమె.. రీసెంట్‌గా గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొని తన కెరీర్ విషయాలను, కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్‌ ఆరంభంలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాని తెలుపుతూ ఆ విషయాలను ప్రస్తావించింది. హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమతో తన కెరీర్ మొదలైందని, అయితే ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. అలాగే రెండో సినిమా విషయంలోనూ అదే జరగడంతో ఇండస్ట్రీలో తనపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారని చెప్పింది. అప్పట్లో ఓ స్టూడియోకి వెళితే అక్కడ తనను చూసిన కొంతమంది.. ఈ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని కామెంట్స్ చేశారని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అలా కొన్ని అవకాశాలు కూడా చేజారాయని చెప్పుకొచ్చింది. తొలుత అలాంటి కామెంట్స్ బాధగా అనిపించినా క్రమంగా వాటికి అలవాటు పడ్డానని, ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్ళి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని కీర్తి చెప్పింది. సక్సెస్‌ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని భావించి కష్టపడ్డానని తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట', చిరంజీవి 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది కీర్తి సురేష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/4Jp9gtae5

How to Add COVID-19 Vaccine Records to Apple Health, Wallet

Keeping COVID-19 vaccine records on phone is the easiest and quickest way to access your vaccine details at any time. Now, any iPhone running on iOS 15.1 allows users to store their COVID-19 vaccine...

from NDTV Gadgets - Latest https://ift.tt/jUs5JKVhy

How to Enable Paytm Tap to Make NFC Payments on Your Android Smartphone

Paytm recently introduced a Tap to Pay feature allowing users with NFC enabled smartphones to make payments by tapping their phones at Point of Sale (PoS) machines. The feature offers the same...

from NDTV Gadgets - Latest https://ift.tt/8uN7Y6yPa

రామ్ చరణ్ వెంట ముంబైకి శ్రీజ.. క్లిష్ట పరిస్థితుల్లో అన్నయ్య సాయం?

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట బెట్టుకొని ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిభిరంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చం సమంత లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రూమర్లకు రెక్కలు కట్టింది. విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్న ఆమె.. రీసెంట్‌గా ఆ పేరును శ్రీజా కొణిదెల‌గా మార్చేసింది. మరోవైపు శ్రీజ- కళ్యాణ్ దేవ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయని, గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్లిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది. పైగా కళ్యణ్ దేవ్ హీరోగా రూపొందిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్‌కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ఇదంతా నడుస్తున్నా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. ఇంతలో సోదరుడు రామ్ చరణ్‌తో ముంబై విమానాశ్రయంలో శ్రీజ కనిపించడంతో ఆ వీడియో వైరల్ కావడమే గాక ఇంతకీ మెగా శిభిరంలో ఏం జరుగుతోంది? అనే చర్చలు ఊపందుకున్నాయి. తన విడాకుల విషయంపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్‌కి వెళ్లిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్ తిప్పుతూ ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ తాజా పరిస్థితులు చూసి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ అనే వ్యక్తిని ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత 2016 సంవత్సరంలో క‌ళ్యాణ్ దేవ్‌‌ని పెళ్లాడింది. వీరికి నవిష్క ఓ పాప కూడా పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకొని మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టాక హీరోగా 'విజేత' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్. సో.. చూడాలి మరి శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rX6apVKti

Micromax In Note 2 Goes on Sale in India Today: All Details

Micromax In Note 2 - launched in India earlier this week - goes on sale in the country for the first time today at 12pm IST. It is powered by a MediaTek Helio G95 SoC, paired with 4GB of RAM....

from NDTV Gadgets - Latest https://ift.tt/UWSiDzGVe

Friday, 28 January 2022

అమ్మ‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్‌!

శ‌నివారం టాలీవుడ్ సీనియర్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ అమ్మ‌గారు అంజ‌నా దేవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా అమ్మ‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘‘అమ్మా ! జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ..అభినందనలతో .... శంకరబాబు’’ అని అన్నారు. ఈ ట్వీట్‌తో పాటు అంజనాదేవితో పాటు తాను, త‌న శ్రీమ‌తి సురేఖ ఉన్న ఫొటోను షేర్ చేశారు చిరంజీవి. ఇటీవ‌ల చిరంజీవికి క‌రోనా పాజివ్ సోకింది. దీంతో ఆయ‌న ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇది కాకుండా గాడ్‌ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, బాబీ డైరెక్ష‌న్‌లో సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. త‌ర్వాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి కూడా చిరంజీవి సిద్ధ‌మ‌య్యారు. వెంకీ కుడుముల సినిమా మిన‌హాయిస్తే.. సెట్స్ పై ఉన్న మిగిలిన సినిమాల‌న్నీ కాస్త హోల్డ్‌లో ప‌డ్డాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://bit.ly/3r6lrmN

Samsung Galaxy S22 Series to Come With 45W Charging Speed: Report

There have been multiple reports about the Samsung Galaxy S22 lineup's charging speeds since last year, with some saying the Galaxy S22 phones will stick to 25W charging, while others claimed the...

from NDTV Gadgets - Latest https://bit.ly/3HjlvWc

ఎన్టీఆర్ సినిమాకు థియేట‌ర్ ఇస్తే.. బాల‌కృష్ణ ఫోన్ చేసి చంపేస్తాన‌ని బూతులు తిట్టారు!.. గుట్టు బయట పెట్టిన నిర్మాత

‘‘’ సినిమా విడుదలకు ముందు నేను ఓసారి డైరెక్ట‌ర్ బి.గోపాల్‌గారిని క‌లిశాను. ఆయ‌న న‌ర‌సింహ నాయుడు సినిమాలోని టెంపుల్ ఫైట్ సీన్ చెప్ప‌గానే సినిమా బావుంటుంద‌నిపించింది. అప్పుడు నిర్మాత ముర‌ళీగారిని వెళ్లి క‌లిసి సినిమా కొన్నాం’’ అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అవుల గిరి. రీసెంట్ టైమ్‌లో నిర్మాత గిరి త‌న సినీ ప్ర‌స్తానం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. అందులో భాగంగా న‌ర‌సింహ నాయుడు సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ ఆ సినిమా నైజాం హ‌క్కుల‌ను మ‌హ‌ల‌క్ష్మి ఫిలింస్‌, మ‌ల్లారెడ్డి అనే వ్య‌క్తితో క‌లిసి తాను కొనుగోలు చేశాన‌ని అన్నారాయ‌న‌. అయితే ‘నరసింహ నాయుడు’ సినిమా విషయంలో హీరో బాల‌కృష్ణ‌తో త‌ను బండ బూతులు వినాల్సి వ‌చ్చిందని ఆయ‌న చెప్పారు. ఇంత‌కీ గిరి ఏమ‌న్నారంటే.. ‘‘ఎన్టీఆర్ తొలి సినిమా ‘’ విడుదలైంది. వాళ్లు దేవి థియేటర్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సరేనని నరసింహనాయుడు సినిమాను తీసేసి, సినిమాకు ఇవ్వాల‌ని అనుకున్నాం. నేను, దిల్‌రాజుగారి ఫంక్ష‌న్ కోసం నిర్మల్‌కు వెళ్లాను. అప్పుడు బాల‌కృష్ణ‌గారు ఫోన్ చేసి బూతులు తిట్టారు. పిచ్చి వేషాలు వేస్తే..చంపేస్తాను అని అన్నారు. స‌రేన‌ని.. ఇక చేసేదేమీ లేక‌.. డబ్బులు వేసుకుని ఆ సినిమాను ర‌న్ చేశాం. ఎన్టీఆర్ సినిమాను ప‌క్క థియేట‌ర్‌లో వేశారు’’ అన్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, బి.గోపాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘నరసింహ నాయుడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 2001లో సినిమా విడుదలైంది. ఆ సినిమా 175 రోజుల ర‌న్నింగ్‌లో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాత అదే ఏడాది మే నెల‌లో ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం నిన్ను చూడాల‌ని విడుద‌లైంది. ఎన్టీఆర్ హీరోగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన చిత్ర‌మది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://bit.ly/3rjK3J7

AT&T, Verizon Cleared by US FAA to Turn on More 5G Cell Towers

US Federal safety regulators say they have cleared the way for Verizon and AT&T to power up more towers for new 5G service without causing radio interference with airplanes.

from NDTV Gadgets - Latest https://bit.ly/3AOhQwX

‘అఖండ’ ఎఫెక్ట్... NBK 107 కోసం ప్లానింగ్ మార్చిన బాలకృష్ణ!

నంద‌మూరి బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రూ.200 కోట్ల క్ల‌బ్‌లో జాయిన్ అయ్యింది. కేవ‌లం మాస్ ప్రేక్ష‌కుల‌కే బాల‌య్య సినిమాలు న‌చ్చుతాయ‌నే ఓ భావ‌న‌ను అఖండ చేరిపేసింది. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో విడుద‌లై కూడా హ‌య్య‌స్ట్ వ్యూస్‌ను సాధించి అందులోనూ రికార్డ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి దృష్టి బాల‌కృష్ణ చేయ‌బోతున్న 107వ సినిమాపై ప‌డింది. అఖండ వంటి భారీ విజ‌యం త‌ర్వాత బాల‌కృష్ణ‌.. క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుండ‌టంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌గానే ఉన్నాయి. అయితే తెలుగు మార్కెట్ పెర‌గ‌డం.. బాల‌య్య అఖండ‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌రికొత్త ప్లానింగ్ చేసింద‌ట‌. ఏదో ఆషామాషీగా కాకుండా NBK 107ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ నాలుగు భాష‌ల్లో హిందీ వెర్ష‌న్ ఉంటుందా? లేక త‌ర్వాత ఏమైనా అనువాదం చేసి రిలీజ్ చేస్తారా? అనేది తెలియ‌డం లేదు. అయితే NBK 107 కోసం భారీ ప్లానింగ్ జ‌రుగుతుంద‌నేది నిజం. NBK 107లో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నేది టాక్‌. ఈ చిత్రానికి జై బాల‌య్య‌.. వేటపాలెం అనే అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజ ఘటలను ఆధారంగా చేసుకుని NBK 107 చిత్రీకరణను చేస్తున్నారట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు క్రాక్ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని, వేట పాలెం బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కించారు. మ‌రోసారి అదే సెంటిమెంటును ఫాలో అవుతూ మ‌రోసారి అదే బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నార‌ట‌. క‌థ‌ను అనుస‌రించే వేట పాలెం అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ని కూడా ఇది వరకు వార్తలు వినిపించాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://bit.ly/3uaAiPa

Netflix Must Face 'Queen's Gambit' Defamation Lawsuit, US Judge Rules

A Georgian former chess world champion's $5-million (roughly Rs. 37.5 crores) lawsuit against Netflix will go ahead after she claimed she was defamed in an episode of The Queen's Gambit, a Los Angeles...

from NDTV Gadgets - Latest https://bit.ly/3KTs8kc

The Ghost : యాక్ష‌న్‌లోకి దిగుతున్న నాగార్జున‌.. దుబాయ్ వెళుతున్న అక్కినేని హీరో!

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థ‌నాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ నాగార్జున చేస్తున్న నెక్ట్స్ మూవీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..‘’. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో నాగార్జున రిటైర్డ్‌ రా ఏజెంట్‌గా క‌నిపించనున్నారు. ఆయ‌న లుక్ కూడా ఇది వ‌ర‌కటి చిత్రాల కంటే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. గుబురు గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో నాగార్జున ఇందులో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ రావ‌డం ఆ గ్యాప్‌లో నాగార్జున బంగార్రాజు సినిమాను పూర్తిచేసి విడుద‌ల చేయ‌డం. సంక్రాంతికి విడుద‌లైన బంగార్రాజు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాగ్‌.. ‘ది ఘోస్ట్’పై ఫోక‌స్ పెట్టారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను దుబాయ్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి టీమ్ దుబాయ్ చేరుకుంటుంది. అక్క‌డ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ నుంగ్ అండ్ టీమ్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. నాగార్జున‌తో పాటు సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొన‌బోతున్నారు. నిజానికి ఈ చిత్రంలో ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావ‌డంతో ఆమె ఘోస్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో కాజ‌ల్ స్థానంలో అమ‌లాపాల్, మెహ‌రీన్ కౌర్ స‌హా కొంత మంది హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. కానీ చిత్ర యూనిట్ చివ‌ర‌కు సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంది. ది ఘోస్ట్ చిత్రంలో అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రంతో అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందులో నాగ చైతన్యతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే మరో వైపు 2017లో రాజవేఖర్‌తో గరుడ వేగ చిత్రాన్ని చేసి హిట్ కొట్టారు. మధ్య లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్‌ను తమన్నాతో చేశారు. ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జునను ప్రవీణ్ సత్తారు ఎంత కొత్తగా చూపిస్తారనేది ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oaJkIa

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్

అనుకున్నది చేస్తా.. అనిపించింది మాట్లాడతా అనే నైజం రామ్ గోపాల్ వర్మది అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. అందుకే ప్రతి క్షణం ఆయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మెదిలే తీరు నిత్యం చర్చల్లో నిలుస్తుంది. లేడీ యాంకర్‌తో ఇంటర్వ్యూ అంటే వర్మ ఎలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారా? అని పనికట్టుకు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అరియానా, అషు రెడ్డి ఇంటర్వ్యూలు ఎంతలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇక వర్మ లోని మరో కోణం హీరోయిన్లతో కలిసి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం. గతంలో చాలాసార్లు ఇలాంటి వీడియోలు బయటకొచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. పబ్‌లో అమ్మాయిలతో చిందులేస్తున్న వీడియోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు . ఈ వీడియోలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆర్జీవీ. ఇద్దరూ సిగరెట్ తాగుతూ సన్నిహితంగా కనిపించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అనుభవించు రాజా, బతికితే నీలానే బతకాలి బాసూ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏంటి వర్మ మాకీ ఖర్మ అంటూ ఆర్జీవీపై ఇంకొందరు విరుచుకుపడుతున్నారు. అయితే జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా ఇలాంటి వీడియోలు పబ్లిక్‌గా వదులుతుండటం వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గతంలో కూడా ఇలాంటి వీడియోలతో వర్మపై ట్రోల్ జరగగా.. ఇద్దరు వ్యక్తులు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే మూడో వాడికి ఏం సంబంధం? ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ మూడో వాడికి ఏంటి? అంటూ చురకలంటించారు వర్మ. తాను అమ్మాయి అందాన్ని విపరీతంగా ఆరాధిస్తానని ఓపెన్ అయ్యారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను. అలాగని సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని వర్మ చెప్పారు. అదే బాటలో వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా వర్మ రూటే సపరేటు లెండి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3HaiEi8

'A sledgehammer to swat a fly'

'I hope the Centre and the states will both act in the spirit of cooperative federalism and find acceptable solutions without testing the law and the limits of each other's power.'

from rediff Top Interviews https://ift.tt/3IGWHri

'What investors want is stability'

'Hope they don't tinker around with capital gains tax in any way.'

from rediff Top Interviews https://ift.tt/3KP50mO

Thursday, 27 January 2022

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్‌తో సినిమా చేసేందుకు వందల కోట్లయినా ఖర్చు చేస్తాం అనే నిర్మాతల లిస్ట్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ '' గురించి బయటకొచ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్' సినిమాను రూపొందించారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్న యూనిట్.. అన్ని హంగులతో కేవలం 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు చేశారు. మొత్తంగా ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయమై డిస్నీ స్టూడియోస్‌తో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారనేది లేటెస్ట్ సమాచారం. ఈ చర్చలు సఫలమైతే ఆదిపురుష్ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ కానుందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై సుమారు 2000 కోట్ల మేర బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమై ఆదిపురుష్ హాలీవుడ్ రేంజ్‌ రిలీజ్ అయితే ఇక ప్రభాస్ క్రేజ్ ఊహకందడం కూడా కష్టమే. ఇకపోతే వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్.. ఇప్పటికే 'రాధేశ్యామ్' మూవీ కంప్లీట్ చేయడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్వకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు ప్రభాస్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ALfCyn

Everything We Know About Crypto Bill Ahead of Budget Session of Parliament

Ahead of the upcoming Budget Session of the Parliament scheduled for February 1, a lot of conjecture around whether the crypto bill will be spoken of has been making the rounds. While we await...

from NDTV Gadgets - Latest https://ift.tt/3s3XzQe

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక తర్జన భర్జనల నడుమ ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి నటేష్ కుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో తెలంగాణ ఊరి ఆడపిల్లగా కీర్తి సురేష్ నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చూద్దామా.. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అబ్బురపరిచిందని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ ఆధారంగా తెలుస్తోంది. స్పోర్ట్ డ్రామా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్, సెకండాఫ్ పర్వాలేదని అంటున్నారు. బ్యాడ్ లక్ వెంటాడుతున్న ఓ అమ్మాయి షార్ప్ షూటర్‌గా జగపతి బాబు దగ్గర కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎలా మంచి పేరు సంపాదిస్తుందనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని, ఈ కథను డైరెక్టర్ అద్భుతంగా మలిచారని ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మళయాలంలో కూడా ఈ సినమా రిలీజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33VoXYt

Wednesday, 26 January 2022

Apple Tops Smartphone Sales in China After 6 Years: Counterpoint

Apple has once again become the top smartphone seller in China after a gap of six years, according to a Q4 2021 market analysis by Counterpoint.

from NDTV Gadgets - Latest https://ift.tt/35uefsr

Samsung Reports 53 Percent Increase in Year-on-Year Profit in Q4 2021

Samsung in its earnings report for the fourth quarter of 2021 said that its operating profit rose 53.3 percent year-on-year in Q4, 2021 to KRW 13.87 trillion (roughly Rs. 86,695 crore), up from 9...

from NDTV Gadgets - Latest https://ift.tt/3g7I7N3

Government Wants to Help Create Indigenous Smartphone OS

The government is looking at a policy to help create an indigenous smartphone operating system that rivals Google's Android ad Apple's iOS, Union Minister of State for Electronics and IT Rajeev...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fXe0rT

RRRలో అల్లూరి పాత్ర చేయాల్సి వ‌స్తే.. ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆతృత‌గా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో మార్చి 18న లేదా ఏప్రిల్ 28కి వాయిదా ప‌డింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ క‌నిపించున్న సంగ‌తి తెలిసిందే. RRRకు సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ చేసిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ గురించి మాట్లాడుతూ, ‘‘నాకు రామ‌రాజు పాత్రను ట్రైల‌ర్‌లో చూస్తే.. నిప్పుల మ‌ధ్య నుంచి దూకుతూ బాణం సంధించే స‌న్నివేశం బాగా న‌చ్చింది. ఎంత బాగా అంటే ఆ ప‌ర్టికుల‌ర్ స‌న్నివేశంలో నేను న‌టించాల‌నంతేగా. ఆ స‌న్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌, ట్రైల‌ర్‌లో ఆ స‌న్నివేశాన్ని చూపించిన సంద‌ర్భం కావ‌చ్చు’’ అన్నారు సినిమాలోని ఇన్‌టెన్సిటీని స‌ద‌రు స‌న్నివేశం చెప్పేస్తుందంటూ ఎన్టీఆర్ రామరాజు పాత్ర గురించి మాట్లాడారు. 1920 బ్యాక్ డ్రాప్‌తో సాగే RRR సినిమా ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌.. ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టించారు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని దాదాపు ఆరు వంద‌ల కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో RRRపై భారీ అంచ‌నాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u9xZvP

'Unemployment is unprecedented'

'In May 2020-2021, nearly 10 crores (100 million) lost jobs.

from rediff Top Interviews https://ift.tt/33Y3o9z

Ram Charan - Keerthy Suresh : రామ్ చ‌ర‌ణ్‌తో కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తి ప్రోమో, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో తార‌క్ - చ‌ర‌ణ్ క‌లిసి చేసిన స్టెప్పుల‌ను అంద‌రూ వేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ క‌లిసి దుమ్ము రేపిన నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - క‌లిసి చేస్తే ఎలా ఉంటుంది! బాగానే ఉంటుంది. హ్యాండ్స‌మ్ హీరో, క్యూట్ హీరోయిన్ క‌లిసి స్టెప్పేస్తే బాగానే ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవ‌వి ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్ న‌ట‌న బావుంటుందని, ‘మ‌హా న‌టి’ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అయ్యాన‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్. ‘’ సినిమా చిన్న‌ సినిమా కాద‌ని.. ఒక వైపు మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకున్న న‌టి కీర్తిసురేష్‌.. మ‌రో వైపు జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ న‌గేష్ ఉన్న‌ప్పుడు దాన్ని చిన్న అనడం కరెక్ట్ కాదని చెప్పిన రామ్ చరణ్..మూవీ పెద్ద హిట్ కావాలని చెబుతూ డైరెక్టర్ నగేష్ కుకునూర్ అండ్ టీమ్‌ను అభినందించారు. అనంత‌రం కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35lOZUZ

'Markets won't see a blind rally post Budget'

'The markets seem apprehensive and that explains why the markets have been feeling slightly uncomfortable ahead of the Budget.'

from rediff Top Interviews https://ift.tt/33VfQXJ

Cryptocurrency Bill at Union Budget 2022: Here's What to Expect

The union government is unlikely to introduce any cryptocurrency regulation or bill in the upcoming budget session of parliament that end on April 8, but taxations rules for crypto holdings could be...

from NDTV Gadgets - Latest https://ift.tt/35lPj69

Tuesday, 25 January 2022

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కు ఎదిగిన అతి కొద్ది మందిలో ర‌వితేజ ఒక‌రు. షోలో సినిమాతో సినీ రంగంపై ఆస‌క్తి పెంచుకున్న ర‌వితేజ‌కు చిత్ర సీమ రెడ్ కార్పెట్ వేయ‌లేదు. అవ‌కాశాల కోసం ఆయ‌న అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అలా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న న‌టుడిగా మారారు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒక‌డిగా, విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా క‌నిపించ‌టం ఇలా చిన్నా చిత‌కా వేషాలు వేసుకుంటూ వ‌చ్చారు. అయితే ఆయ‌న లైఫ్‌ని ట‌ర్న్ చేసిన సినిమా ‘నీకోసం’. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పుడు హీరోగా సినిమానా? అని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు మ‌రి. కొన్ని ఇబ్బందుల‌ను ప‌డి సినిమా విడుద‌లైంది. సినిమాకు చాలా మంచి పేరు వ‌చ్చింది. శ్రీనువైట్లకే కాదు.. హీరోగా ర‌వితేజ‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. అలాంటి త‌రుణంలో ర‌వితేజ‌కు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్‌. హీరోయిజాన్ని డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే పూరీ చేతిలో ర‌వితేజ ప‌డ‌గానే ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి ఎదిగారు. పూరీ త‌న హీరో ఎలా ఉండాల‌నుకుంటారో.. అంత‌కు ప‌ది రెట్లు ఉండేలా త‌న న‌ట‌న‌తో వెండితెర‌పై ఎస్టాబ్లిష్ చేశారు ర‌వితేజ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం హిట్ అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన ఇడియ‌ట్‌, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ రెండు సినిమాల స‌క్సెస్‌తో ర‌వితేజ స్టార్ హీరోగా మారిపోయారు. ఖ‌డ్గం, వెంకీ, భ‌ద్ర, విక్క‌మార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ‌, కిక్‌, మిర‌ప‌కాయ్‌, బ‌లుపు, క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌, శంభో శివ శంభో వంటి డిఫ‌రెంట్ మూవీస్‌లోనూ న‌టించారు. కొన్ని సినిమాల్లో పాత్ర‌ల‌కు నెరేట్‌గా కొత్త జీవం తెచ్చిన ర‌వితేజ‌.. గాయ‌కుడిగానూ పాటలు పాడిన సంద‌ర్భాల్లు కోకొల్ల‌లు. కొత్త ద‌ర్శ‌కుల‌ను, యంగ్ టాలెంట్‌ను ర‌వితేజ బాగా ఎంక‌రేజ్ చేస్తుంటారు. శ్రీనువైట్ల‌, గోపీ చంద్ మ‌లినేని, బోయ‌పాటి శ్రీను, కె.ఎస్‌.ర‌వీంద్ర‌, అనీల్ రావిపూడి వంటి ద‌ర్శ‌కుల‌తో ర‌వితేజ ప‌నిచేసి విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను అందించారు. 2021లో క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ర‌వితేజ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే ధ‌మాకా, రావ‌ణాసుర సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు ర‌వితేజ. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే గోల్‌గా దూసుకెళ్తున్న ర‌వితేజ పుట్టిన‌రోజు నేడు (జ‌న‌వ‌రి 26). ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇదే ఎన‌ర్జీతో మ‌రెన్నో పుట్టిన‌రోజుల‌ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది ‘స‌మ‌యం తెలుగు’.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3IHQ2gB

OnePlus 10 Ultra Said to be Under Testing, an 'Ultra Flagship' Model

OnePlus 10 Ultra is reportedly undergoing engineering verification testing (EVT). This suggests that OnePlus may launch the smartphone in the coming months. OnePlus is also said to get Oppo's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qYWAkW

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. త్వ‌ర‌లోనే మీ అంద‌రినీ క‌లుస్తాను’’ అని తెలిపారు. ఇంతక ముందు ఓసారి ఇలాగే చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చిరంజీవి వెంటనే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ..తప్పుడు కరోనా కిట్‌తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ ఫలితం వచ్చిందని తను బాగానే ఉన్నానంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పనులతో బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన సామాజిక దూరం పాటించేవారు. అయితే ఎలాగో ఆయన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా.. సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో దాదాపు రెండు వారాల పాటు ఆయన సినిమా షూటింగ్స్ అన్నీ వెనక్కి వెళ్లినట్లే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35eKaNe

'Nehru misunderstood religion'

'Nehru's inability to take religion seriously as a category led to serious errors of judgement in his dealings with the Muslim League, and later, also with the Hindu right.'

from rediff Top Interviews https://ift.tt/3KMZnW0

Snapchat India Launches Republic Day-Themed Lenses, Geofilters, Stickers

Snapchat has introduced new lenses, geofilters, stickers, Bitmojis, Bitmoji geofilters, and hyperlocal geofilters to mark Republic Day celebration. Snap will also partner with Vivo, Oppo and Samsung...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nYQj6Q

Padma Shri: అలనాటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో పద్మ పురస్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి అవార్డులు వరించాయి. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు అలనాటి విలక్షణ నటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 90 ఏళ్ల వయసులో ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం. ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన షావుకారు జానకి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలుకొని నేటితరం హీరోల తోనూ తెరపంచుకున్నారు. 1931 డిసెంబర్‌ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత రేడియో నాట‌కాల్లో, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇస్తూ సినీ గడప తొక్కారు. దర్శక నిర్మాత బి.ఎన్‌. రెడ్డి రికమండేషన్‌‌తో ఆమెకు 'షావుకారు' అనే చిత్రంలో హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇదే ఆమె తొలి సినిమా. ఈ మూవీతో మంచి పేరు రావడంతో 'షావుకారు' అనే పేరే జానకి ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పరంగా పలు సినిమాల్లో భాగమైన ఆమె తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్‌ ,శివాజీ గణేశన్‌ సరసన నటించారు. ''వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతం ఊరు, జయం మనదే, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్లు, మంచి కుటుంబం'' లాంటి సినిమాలు షావుకారు జానకికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉన్నారు. షావుకారు జానకికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33RHtRw

Republic Day Parade 2022: How to Watch the Celebrations Live Online

Republic Day Parade 2022 livestream and telecast will take place today (Wednesday, January 26). The parade will begin from 10:30am and feature a grade flypast by 75 aircraft and helicopters of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3G3cCOK

Monday, 24 January 2022

Facebook-Parent Meta Creates 'World's Fastest' AI Supercomputer

Meta said it has created what it believes is among the fastest artificial intelligence supercomputers running today.

from NDTV Gadgets - Latest https://ift.tt/3Aw4pSn

Rajasekhar : సినిమా నుంచి త‌ప్పించాల‌ని జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టారు : సముద్ర‌

తెలుగులో సింహరాశి, శివ రామ‌రాజు, సూర్యం, మ‌హా నంది, ఎవ‌డైతే నాకేంటి.. ఇలా ప‌లు చిత్రాల‌ను ఆయ‌న డైరెక్ట్ చేశారు. ఈయ‌న డైరెక్ట్ చేసిన చిత్రాల్లో సింహ‌రాశి, ఎవ‌డైతే నాకేంటి చిత్రాలను రాజ‌శేఖ‌ర్‌తో ఆయ‌న రూపొందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. డైరెక్ట‌ర్‌గా ఈయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించి రెండు ద‌శాబ్దాలు అయ్యాయి. ఈ సంద‌ర్భ‌లో ఈయ‌న రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటు పోట్లు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. హీరో రాజ శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి, సీనియ‌ర్ న‌టి జీవితలతో జర్నీలో వచ్చిన పొరపచ్చాలు గురించి స‌ముద్ర మాట్లాడుతూ ‘‘నా ప్రయాణంలో పొరపచ్చాలు అంటే రాజశేఖర్‌తో వ‌చ్చింది. నేను ఆయ‌న‌తో ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. అంత‌కు ముందు ఆయ‌న‌తోనే నేను డైరెక్ట్ చేసిన ‘సింహ రాశి’ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు స‌రైన హిట్స్ లేవు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌ను డైరెక్ట్‌చేయ‌మ‌ని నన్ను అడిగారు. అయితే ఆ క‌థ‌లు నాకు న‌చ్చ‌లేదు. దాంతో నేను వ‌ద్ద‌ని అన్నాను. కానీ రాజ‌శేఖ‌ర్ త‌న‌తో నేను సినిమా చేయ‌డం ఇష్టం లేక వ‌ద్దంటున్నాన‌ని అనుకునేవారు. త‌ర్వాత ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమా కథ విన్నాను. అది నచ్చడంతో సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా దాదాపు 70-80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సినిమా బాగా వ‌చ్చింద‌ని, సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఓ న‌మ్మ‌కం వ‌చ్చింది. దాంతో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్‌గా నా పేరు తీసేసి.. వాళ్ల పేర్లు వేసుకోవాల‌ని అనుకున్నారు. దాంతో స్పాట్‌లో నన్ను ఇరిటేట్ చేయ‌డం.. త‌క్కువ చేసి మాట్లాడ‌టం చేశారు. స‌రే! వీళ్ల గొడ‌వ ఇదే క‌దా.. ఎందుకొచ్చిన ఇబ్బంది అని నాకు అనిపించింది. ‘సినిమాలో నా పేరు తీసేసి మీ పేరు వేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మీరే వేసుకోండి, నా కొద్దు సినిమా.. నాకేం ప్రాబ్లెమ్ లేదు. నేను వెళ్లిపోతా. రేప‌టి నుంచి నేను రాను’ అని చెప్పేసి వెళ్లిపోయాను. నాకు అలాంటి అనుభవం ఎదురుకావ‌డం అదే తొలిసారి. నేను వెళ్లిపోయిన త‌ర్వాత వాళ్లు రియ‌లైజ్ అయ్యారు. తర్వాత ‘లేదండి మీరే చేయండి ’అని జీవిత‌గారు నాతో మాట్లాడారు. అలాగే ‘నువ్వు నాకు బ్ర‌ద‌ర్‌లాంటోడివి’ అని రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. దాంతో సరేనని నేను అనుకున్నాను. త‌ర్వాత నాతోనే ఆ సినిమాను పూర్తి చేయించారు. చివ‌ర‌కు నా పేరు కింద వాళ్ల పేర్లు వేసుకున్నారు’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34aQxAU

'This is the moment to reintroduce wealth tax'

'From March 2020 to November 2021, the combined wealth of the billionaires of this country has doubled.'

from rediff Top Interviews https://ift.tt/33IXEka

'అఖండ'పై బీ టౌన్ పీపుల్ డిమాండ్స్.. ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే!!

నందమూరి నటసింహం క్రేజ్ అంటే ఇదీ మరి అని 'అఖండ' సినిమాతో మరోసారి నిరూపణ అయింది. 'ప్యాన్ ఇండియా సినిమా తీయడం వేరు.. తీశాక ప్యాన్ ఇండియా క్రేజ్ రావడం వేరు' ఈ రెండిటికీ ఉన్న తేడానే సదరు సినిమా లెవెల్ ఏంటనేది స్పష్టం చేస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో అదే జరుగుతోంది. మూవీ కోసం బాలీవుడ్ తెరలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్ కావాలంటూ సోషల్ మీడియాలో బీ టౌన్ పీపుల్ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చేయాలంటూ నార్త్ ఇండియన్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ''అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్'' ధర్మ అంటూ హిందీ వర్షన్ ఈ మూవీ కోరుతున్నారు. ఈ మేరకు #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అఖండ పోస్టర్స్ షేర్ చేస్తూ తమ తమ డిమాండ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో విడుదలై 50 రోజులు పూర్తయ్యాక కూడా అఖండ మూవీ ట్రెండ్ అవుతుండటం విశేషం. బాలకృష్ణ- బోయపాటి హాట్రిక్ కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇటీవలే 103 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జనవరి 21 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ స్టార్ట్ కాగా తొలి 24 గంటల్లో పది లక్షల స్ట్రీమింగ్స్ సాధించి డిజిటల్ రంగంలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. చిత్రంలో బాలయ్య నటన, బోయపాటి టేకింగ్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేశాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా త్వరలో యూట్యూబ్‌లో హిందీ వర్షన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qW7Can

జీవితంలో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్

మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విశేషాలతో పాటు మహేష్ బాబు సినిమా సంగతులను నెటిజన్ల ముందుంచుతూ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామీలీ ట్రిప్స్, కుటుంబంతో జరుపుకున్న స్పెషల్ ఈవెంట్ ఫొటోస్ అందరితో పంచుకోవడమంటే నమ్రతకు మహా సరదా. ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలిద్దరితో ఓ స్పెషల్ మూమెంట్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నమ్రత. రీసెంట్‌గా జనవరి 22న తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు నమ్రత శిరోద్కర్. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన మహేష్, ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్‌లతో ఎంజాయ్ చేశారు. అయితే ఆ సంబరాల నుంచి ఓ ర్యాండమ్ పిక్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నమ్రత.. ''ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు'' అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి బయట పెట్టారు. దీంతో ఎప్పటిలాగే ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో క్షణాల్లో వైరల్ కావడమే గాక దీనిపై లైకుల వర్షం కురుస్తోంది. కొడుకు, కూతురు అంటే అటు మహేష్ బాబు, ఇటు నమ్రత చాలా ఇష్టంగా ఉంటారు. ఓ వైపు తమ తమ ప్రెఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఏ మాత్రం గ్యాప్ దొరికినా పిల్లలిద్దరితో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేయడం మహేష్- నమ్రత హ్యాబీ. దీంతో ఈ సెలబ్రిటీ ఫ్యామిలీ బాండింగ్, ప్రేమానురాగాలు చూసి 'ది కంప్లీట్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్' ఇలా పలు రకాలుగా రియాక్ట్ అవుతుంటారు నెటిజన్లు. ఇకపోతే పెళ్లికి ముందు సినిమా హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త వ్యాపార కార్యకలాపాల్లో భాగమవుతున్నారు నమ్రత శిరోద్కర్. గృహిణిగా పిల్లల బాధ్యతతో పాటు మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ ఆమెనే దగ్గరుండి చూసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nRvKJq

'Another 600 to 700 points fall is possible'

'This fall is nothing. We could see worse if everybody hits the panic button.'

from rediff Top Interviews https://ift.tt/3KHZeDi

Sunday, 23 January 2022

NDRF Twitter Handle Hacked, Fully Restored Later

The official Twitter handle of the National Disaster Response Force (NDRF) was hacked late Saturday and fully restored by Sunday evening, officials said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3GVd0jz

అల్లు అర్జున్‌, య‌ష్ స‌హా ద‌క్షిణాది స్టార్స్‌కి కంగ‌నా జాగ్ర‌త్త‌లు! బాలీవుడ్ ఉచ్చులో చిక్కుకోవ‌ద్ద‌ని స‌ల‌హా!

కంగ‌నా ర‌నౌత్‌.. బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తూ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్‌. సినిమాల ప‌రంగా ఆమె చాలా ఒడిదొడుకుల‌నే ఎదుర్కొన్నార‌నే సంగ‌తి తెలిసిందే. ఇక ఆమెకు వివాదాలు కూడా ఏమీ కొత్త కావు. హృతిక్ రోష‌న్‌తో బ‌హిరంగంగా గొడ‌వ‌ప‌డ్డా..బాలీవుడ్‌లోనెపోటిజంపై ఘాటు వ్యాఖ్య‌లు చేసినా.. తాప్సీ, ఆలియా వంటి స్టార్ హీరోయిన్స్‌పై మాట‌ల‌తో డైరెక్ట్ ఎటాక్ చేసినా ఆమెకే చెల్లింది. కంగ‌నా ర‌నౌత్ ప‌లు సంద‌ర్భాల్లో ఘాటు వ్యాఖ్య‌లు చేస్తుంటారు. వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు వ్య‌క్తుల‌తోనే కాదు.. ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతోనే ఆమె మాట‌ల యుద్ధం చేస్తూ వ‌స్తున్నారు. దేశ రాజ‌కీయ ప‌రిస్థితులపై కంగ‌నా తూటాల్లాంటి మాట‌ల‌తో ఫైర్ బ్రాండ్‌లా మారిపోయింది. లేటెస్ట్‌గా త‌న‌దైన స్టైల్లో బాలీవుడ్‌పై విరుచుకుప‌డింది. అయితే ఈసారి ఆమె ద‌క్షిణాది తార‌ల‌కు త‌న మ‌ద్ద‌తుని తెలిపారు. రీసెంట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో ‘పుష్ప ది రైజ్’ మూవీ భారీ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ‘పుష్ప ది రూల్’ రానుంది. మ‌రో వైపు ద‌క్షిణాది నుంచి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న భారీ పాన్ ఇండియా మూవీ KGF Chapter2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల్లో న‌టిస్తున్న హీరోలు అల్లు అర్జున్‌, య‌ష్ ఫొటోల‌ను షేర్ చేసిన కంగ‌నా రనౌత్ దక్షిణాది సినిమాలు, హీరోలకు ఆదరణ ఎక్కువగా ఉండటంపై స్పందిస్తూ 1. దక్షిణాది స్టార్స్ మ‌న దేశ సంస్కృతి సంప్ర‌దాయ మూలాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. 2. వారు త‌మ కుటుంబాల‌కు, బాంధ‌వ్యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు3. సినిమాపై వారికున్న ప్యాష‌న్‌, వృతిప‌ర‌మైన నిబ‌ద్ధ‌త అపార‌మైన‌ది వంటి కార‌ణాల‌ను వివ‌రించారు. ఇదే పోస్ట్‌లో ఆమె బాలీవుడ్ మిమ్మ‌ల్ని పాడు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. వారి వ‌ల‌లో చిక్కుకోకండి అంటూ సూచ‌న కూడా చేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. జ‌య‌లలిత జీవితం ఆధారంగా రూపొందిన త‌లైవి సినిమాలో టైటిల్ రోల్‌లో కంగ‌నా ర‌నౌత్ న‌టించింది. త‌ర్వాత ఆమె ఏ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు. అన్ని సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. థాక‌డ్ వంటి పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమాతో ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. తేజ‌స్ సినిమాలో యాక్ట్ చేస్తున్న కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు త‌న సొంత బ్యాన‌ర్‌లో టీకు వెడ్స్ షేరు అనే సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. వీట‌న్నింటితో పాటు ఇందిరా గాంధీ బ‌యోపిక్‌లోనూ ఆమె న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేవ ఉక్కు మ‌హిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాల‌ను తెలుసుకుని క‌థ‌ను రూపొందించే ప‌నిలో కంగన అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంది. దీనికి ఎమెర్జెన్సీ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KzOzup

'People have realised Modi can't deliver the goods'

'What is most distressing is that the revival of the economy, creation of more employment, and reducing poverty are not on the agenda of the government at all.'

from rediff Top Interviews https://ift.tt/3Ixail2

Why This Goa Minister Quit The BJP

'The projects that the government started to bring within Goa were totally anti-Goa and anti-people.'

from rediff Top Interviews https://ift.tt/3ArqMrN

'I have never used a teleprompter'

'In Hindi, Mr Modi is unequalled as an exceptionally accomplished orator.'

from rediff Top Interviews https://ift.tt/357ogeM

'India has never seen a film like this'

'I don't think you have seen any Indian actor play a character like this.'

from rediff Top Interviews https://ift.tt/341aHgC

విజ‌య్ 66 గురించి దిల్ రాజు ప్లానింగ్‌.. ఏమాత్రం త‌గ్గ‌నంటున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌!

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌పై ఫోక‌స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న రెండు భారీ పాన్ ఇండియా సినిమాల‌ను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ మూవీ. కాగా.. రెండో చిత్రం కోలీవుడ్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో చేస్తున్నారు. ఇది వ‌ర‌కే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది కూడా. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తారు. మిగిలిన క‌న్న‌డ‌, మ‌లయాళ‌, హిందీ భాష‌ల్లో అనువాదం చేసి విడుద‌ల చేస్తారు. విజ‌య్ తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో కొలాబ్రేట్ అవుతున్న తొలి చిత్ర‌మిది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు విజ‌య్‌తో చేయ‌బోయే సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ‘‘మార్చి నుంచి విజయ్ 66వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌నేది మా ప్లానింగ్. అన్నీ స‌వ్యంగా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే దీపావ‌ళికి ఓ మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తాం’’ అన్నారు దిల్ రాజు. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు విజయ్ 66ను ఫ్యామిలీ ఎంటైర్‌టైన‌ర్‌గా రూపొందించనున్నార‌ట‌. శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ త‌న 65వ చిత్రం బీస్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. బీస్ట్ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. సినిమాను ఏప్రిల్ నెల‌లో త‌మిళ సంవ‌త్స‌రాదిన విడుద‌ల చేయాల‌నేది ప్లానింగ్‌గా క‌నిపిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఇక దిల్ రాజు మ‌రో వైపు మ‌రో పాన్ ఇండియా మూవీ రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తున్నారు. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక శంక‌ర్ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండ‌నుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు స‌న్నాహాలు చేసుకుంటున్నారు మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KzSW8T

Nani : ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి.. నానికి మరో హిట్ దక్కేనా?

నేచుర‌ల్ స్టార్ హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎంటర్‌టైన‌ర్ ‘అంటే..సుంద‌రానికీ!’. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని నాని ఓ చిన్న వీడియో ద్వారా తెలియ‌జేస్తూ స‌ద‌రు వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ఇక సినిమా షూటింగ్ పూర్త‌య్యింద‌ని చెప్ప‌డంతో యూనిట్ అంతా సంతోషంతో కేరింత‌లు కొట్టారు. నాని త‌న టీమ్‌తో క‌లిసి అంటే సుంద‌రానికీ అంటూ గోల చేశారు. వారితో సెల్ఫీ దిగారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేస్తున్నారు నిర్మాత‌లు. నానికి సంబంధించి లుక్‌, జీరోత్ లుక్ అంటూ విడుద‌ల చేసిన ప్రోమోల‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ఇందులో బ్రాహ్మ‌ణ అబ్బాయిగా క‌నిపించ‌బోతున్నార‌నే సంగ‌తి తెలుస్తుంది. ప్రేమ కోసం నాని అమెరికా వెళ‌తార‌ని, అక్క‌డే మ‌న వాడు ప‌డే ఇబ్బంద‌లు అన్నీ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయ‌ని స‌మాచారం. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా సినిమాలో స‌క్సెస్‌ల‌ను అందుకున్న డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ‘అంటే.. సుంద‌రానికీ!’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇంకా న‌దియా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుహాస్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. గ‌త ఏడాది చివ‌ర‌లో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో నాని హిట్ కొట్టారు. అదే స్పీడుని కంటిన్యూ చేస్తూ నాని ఈ సినిమాతో మ‌రో హిట్ సాధిస్తార‌ని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక నాని త‌న త‌దుప‌రి చిత్రం ‘ద‌స‌రా’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ కానున్నారు. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు రోష‌న్ మాథ్యూ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా సంతోష్ నారాయ‌ణ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో నాని ప‌క్కా మాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. గుబురు గ‌డ్డంతో నాని ఉన్న లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేస్తే దానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే నాని పాత్ర గ్రే షేడ్‌లో సాగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nTDWsO

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వారు నిర్మాత‌లుగా చేస్తున్న 50వ చిత్ర‌మిది. ఈ సినిమాలో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గానూ.. చీఫ్ మినిస్ట‌ర్ పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు సీనియ‌ర్ న‌టుడు RC 15లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌నే చెప్పుకొచ్చారు. RC 15లో నా పాత్ర‌ను చూసి ఇదేంటి ఇది మ‌న శ్రీకాంతేనా? అని అంద‌రూ అనుకునేంత‌లా నా పాత్ర‌ను శంక‌ర్‌గారు చూపించ‌బోతున్నారంటూ శ్రీకాంత్ తెలిపారు. అంటే శ్రీకాంత్ పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌తో సాగుతుందా? లేక పాజిటివ్ ట‌చ్‌తో సాగుతుందా? అనేది మాత్రం తెలియ‌డం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ చేసిన భారీ పాన్ ఇండియా మూవీ RRR. ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కార‌ణంగా వాయిదా పడింది. దీంతో ఇప్ప‌డు RRR చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. అలాగే తండ్రి చిరంజీవితో క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. ఆచార్య‌, RRR సినిమాల‌కు సంబంధించిన వ‌ర్క్ అంతా పూర్త‌వ‌డంతో ఇప్పుడు చ‌ర‌ణ్ త‌న RC 15 ఫోక‌స్ చేశారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ రెడీ అయిపోతున్నారు. ఆ విష‌యాన్ని వాళ్లు చెప్పేశారు కూడా. త‌దుప‌రి చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇలా మెగా ప‌వ‌ర్ స్టార్ త‌న సినిమాల‌న్నంటినీ పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qTjqKx

Saturday, 22 January 2022

Bangarraju : బ్ర‌హ్మానందంను తీసుకుంటే వ‌చ్చే స‌మ‌స్య అదే.. అందుకే ‘బంగార్రాజు’లో తీసుకోలేదు : అక్కినేని నాగార్జున‌

టాలీవుడ్ కామెడీ కింగ్ అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు బ్ర‌హ్మానందం. ఒకానొక ద‌శ‌లో తెలుగులో ఆయ‌న లేని సినిమా ఉండేది కాదు. చిన్న పాత్ర‌లో ఆయ‌న క‌నిపించేవారు. అంత క్రేజ్ సంపాదించుకున్నారు బ్ర‌హ్మానందం. ఈ న‌వ్వుల బ్ర‌హ్మ అప్ప‌ట్లో త‌న క్రేజ్‌కు త‌గిన‌ట్లే రెమ్యున‌రేష‌న్ కూడా వ‌సూలు చేసేవారు. ఓ రోజుకు ఆయ‌నకు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేవార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అలాంటి ఆయ‌న ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌టం లేదు. వ‌య‌సు రీత్యా వ‌చ్చిన సినిమాల‌న్నీ చేయాల‌ని బ్ర‌హ్మానందం అనుకోవ‌డం లేదా? లేక మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌డం లేదు. అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సినిమాల్లో సొగ్గాడే చిన్ని నాయ‌నా ఒక‌టి. ఐదేళ్ల ముందు సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు సినిమా విడుద‌లై ఇంకా పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకుంది. సొగ్గాడే చిన్ని నాయ‌నాలో క‌నిపించిన కొన్ని పాత్ర‌లు బంగార్రాజు సినిమాలో క‌నిపించ‌లేదు. అందులో బ్ర‌హ్మానందం పాత్ర కూడా ఒక‌టి. ఆయ‌న్ని ఎందుకు బంగార్రాజు సినిమాలో తీసుకోలేదు అని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో అక్కినేని నాగార్జున‌ను ప్ర‌శ్నిస్తే, ఆయ‌న మాట్లాడుతూ ‘‘‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కనిపించిన అన్నీ పాత్రలను కథానుగుణంగా ‘బంగార్రాజు’ సినిమాలో తీసుకోలేం. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత న‌డిచే క‌థ‌గా బంగార్రాజును చూపించాం. అంటే సొగ్గాడే చిన్ని నాయ‌నాలో యంగ్‌గా క‌నిపించిన వారంద‌రినీ ఈ సినిమాలో మ‌ళ్లీ యంగ్‌గా చూపించ‌లేం. అందుక‌నే కొన్ని పాత్ర‌లు మ‌న‌కు బంగార్రాజులో క‌నిపించ‌వు. ఉదాహ‌ర‌ణ‌కు అన‌సూయ పాత్ర‌ను ఓల్డ్‌గా చూపించ‌లేం. అలాగే బ్ర‌హ్మానందం పాత్ర‌ను తీసుకుంటే దాన్ని 80-85 పాత్ర‌గా చూపించాలి. అలాంటి స‌మ‌స్య వ‌స్తుంద‌ని ఆ పాత్ర‌ను చూపించ‌లేదు’’ అని అన్నారు. అక్కినేని నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా ఇందులో న‌టించారు. నాగ్ జోడీగా ర‌మ్య‌కృష్ణ క‌నిపిస్తే.. చైత‌న్య జోడీగా కృతి శెట్టి క‌నిపించింది. క‌ళ్యాణ్ కృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా తొలి మూడు రోజుల్లోనే యాబై కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి కెరీర్ బెస్ట్ మూవీగా బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి విన్న‌ర్ అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3IrUwrj

అది దాచినా దాగదు : శ్రుతి హాసన్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్‌కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. ఆమెను నెత్తిన పెట్టుకుంది కూడా టాలీవుడ్డే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినా కూడా తెలుగులో లక్కీ హ్యాండ్‌గా మారింది. గబ్బర్ సింగ్ రూపంలో ఆమె తన మొదటి విజయాన్ని రుచి చూసింది. అలా శ్రుతి హాసన్‌కు టాలీవుడ్ కలిసి వచ్చింది. జనవరి 28న శ్రుతి హాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను చెప్పుకొచ్చింది. సెవెన్త్ సెన్స్ సినిమా చేసిన సమయంలోనే తన మీద తనకు నటించగలను అని నమ్మకం ఏర్పడిందట. మురుగదాస్ ఇచ్చిన ధైర్యం, నమ్మకంతోనే ఆ పాత్రను పోషించానని తెలిపింది. ఈ పాత్రను చేయగలనా? అని భయపడుతుంటే.. నేను నిన్ను నమ్ముతున్నాను నీ మీద నీకు నమ్మకం లేదా? అని మురుగుదాస్ అన్నారట. అయితే తనను మొదట స్వీకరించింది మాత్రం తెలుగు ప్రేక్షకులేనని, తొలి విజయం దక్కింది కూడా ఇక్కడేనని తెలిపింది. అందుకే ఎన్ని భాషల్లో నటిస్తున్నా కూడా తెలుగులో నటించడం అంటే ప్రత్యేకంగా భావిస్తానని పేర్కొంది. ఇక సీనియర్లైన బాలయ్య, చిరు సినిమాల్లో నటించడంపైనా స్పందించింది. సీనియర్లు, యువ హీరోలు అనేవి లెక్కలేవీ వేసుకోనని, కథ, పాత్రలు నచ్చితే చేస్తానని అంది. దాదాపు 13 ఏళ్ల ప్రయాణం తరువాత కూడా అలాంటి అలోచనలు ఉంటే కుదరదు అని చెప్పుకొచ్చింది. ఇక తన వయసు గురించి చెబుతూ.. అది దాచినా దాగదని, వయసుకు తగ్గట్టు మనుషులు మారుతుంటారని తెలిపింది. శారీరకంగా నాలోనూ పెద్ద ఎత్తున మార్పులు వచ్చినా తానేమీ ఫీల్ అయ్యేదాన్ని కాదని పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3H9uuct

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడు అని రూమర్లు రావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతున్నారు. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా మమ్మల్ని చూసి జాలి పడుతున్నారు అన్నా.. ప్లీజ్ మారుతితో సినిమా చేయకు అన డార్లింగ్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయిందని, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతోన్నాడని, తమన్ సంగీతం అందించనున్నాడని గాసిప్పులు బయటకు వచ్చాయి. రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా కన్పామ్ అయిందట. ఈ వార్తల పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహావేశానికి లోనవుతున్నారు. సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ మారుతితో మాత్రం చేయకు అని కోరుకుంటున్నారు. ఇక ఇది రూమరో, అఫీషియల్‌గా ఫిక్స్ అయిన ప్రాజెక్టో ఏమో గానీ దీని పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. ప్రభాస్ స్టేటస్‌కు తగ్గ కథను మారుతి ఇవ్వగలడా? అంతర్జాతీయ స్థాయిలో సినిమాను చేయగలడా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మీద వస్తోన్న రూమర్ల గురించి మారుతి స్పందించాడు. నా భవిష్యత్ ప్రాజెక్ట్, టైటిల్, జానర్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి వాటి గురించి రూమర్లు వస్తున్నాయి. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. మీ సపోర్ట్, ప్రోత్సాహానికి థ్యాంక్స్. జాగ్రత్తగా ఉండండి.. స్టే సేఫ్ అంటూ ట్వీట్ వేశాడు మారుతి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టా? లేనట్టా? అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KCw9Jk

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది. సీనియ‌ర్ న‌టుడు కృష్ణ పెద్ద కుమారుడైన ర‌మేష్ బాబు (56) అనారోగ్య కార‌ణంగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. సోద‌రుడితో అత్యంత స‌న్నిహితంగా ఉండే మ‌హేష్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఎందుకంటే ఆయ‌న కోవిడ్ కార‌ణంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి. సోద‌రుడిని చివ‌రి చూపుకు కూడా నోచుకోలేక‌పోయారు. ఇప్పుడు మ‌హేష్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. ర‌మేష్ బాబు పెద్ద క‌ర్మ‌కు హాజ‌ర‌య్యారు. అన్న‌య్య ర‌మేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి ప‌లుమార్లు మ‌హేష్ చెప్పేవారు. ర‌మేష్ బాబు చ‌నిపోయిన రోజున మ‌హేష్ సోష‌ల్ మీడియాలో చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ అంద‌రికీ తెలిసిందే. అలాంటి సోద‌రుడు దూరం కావ‌డం అనేది మ‌హేష్‌కు తీర‌ని లోటే. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి చెందిన స‌న్నిహితులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి సినిమాలు కూడా చేశారు. అప్పుడు మ‌హేష్ బాల న‌టుడిగా ఉండేవారు. బ‌జార్ రౌడీ, ముగ్గురు కొడుకులు సినిమాల్లో ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు క‌లిసి యాక్ట్ చేశారు. తండ్రి బాట‌లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు . తెలుగు సినిమా చరిత్ర‌లో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్ర‌లో క‌నిపించారు. నటుడిగా అదే ఆయ‌న తొలి సినిమా. త‌ర్వాత మ‌రి కొన్ని చిత్రాల్లో ర‌మేష్ బాబు బాల న‌టుడిగా క‌నిపించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. మొత్తం ప‌దిహేను సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూర‌మ‌య్యారు. కృష్ణ న‌టించిన ఎన్‌కౌంట‌ర్ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఆ త‌ర్వాత ఆయ‌న న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారారు. తండ్రి పేరు మీద‌నే కృష్ణ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. త‌ర్వాత సినీ రంగానికి ఎందుక‌నో దూర‌మ‌య్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qUthjv

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు ఆ నోర్లన్నీ కూడా మూసుకుపోయాయి. బాలయ్య దెబ్బకు విమర్శిన వాళ్లంతా నోరెళ్లబెట్టేశారు. షోను బాలయ్య అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. టాప్ రేటింగ్ సొంతం చేసుకున్న షోగా రికార్డులు క్రియేట్ చేసింది. ముందు చెప్పినట్టుగానే టాక్ షోలకే బాప్ షో అన్నట్టుగా మారింది. అయితే బాలయ్య మాట్లాడే విధానం, వచ్చిన గెస్టులతో ఇమిడిపోయే తీరు అందరినీ ముచ్చటపడేలా చేస్తోంది. స్టార్స్ ఇది వరకు ఎక్కడా కూడా చెప్పని విషయాలను బాలయ్య నెమ్మదిగా లైన్‌లో పెట్టి, వారిని నొప్పించకుండా అడుగుతుంటాడు. మొత్తానికి అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎపిసోడ్ ముగుస్తోంది. ఈ ఫిబ్రవరి 4న చివరి ఎపిసోడ్ రాబోతోంది. అది కూడా గెస్టుగా వచ్చిన ఎపిసోడ్‌తోనే ముగుస్తోంది. అయితే బాలయ్య సూపర్ స్టార్‌ను హ్యాండిల్ చేసిన విధానం, చూపించిన మరో కోణంతో ప్రోమో ఒక్కసారిగా వైరల్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే.. కేవలం సినిమాలు అని కాదు.. మానవీయకోణం ఉందని, తన పిల్లలు, ఫ్యామిలీ అంటూ ఇలా ముందుకు సాగించాడు. మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ గురించి బాలయ్య తన ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఎపిసోడ్ ఫిబ్రవరి 4న రాబోతోంది అని చెప్పుకొచ్చాడు. ఇక రెండో సీజన్‌కు చిరంజీవిని హోస్ట్‌గా తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Ixdj4v

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు. అలాంటి యువకుడికి ఇప్పుడు ఏకంగా సినిమాలో నటించే ఛాన్సే వచ్చేసింది. షూటింగ్ స్పాట్‌లో ఇలా కనిపించాడు. ఈ యువకుడి పేరు ప్రశాంత్. తరచూ పబ్లిక్ టాక్ వీడియోలు చూసేవారు ఇతడిని ‘అతిగాడు’ అని పిలుస్తారు. ఇప్పుడు తనకు ఇష్టమైన యాక్టింగ్ కూడా అతిగానే చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రశాంత్ బ్యాచ్‌లో అందరూ పూనకంతో ఊగిపోతూ సినిమా రివ్యూలు చెబితే.. ఇతడు మాత్రం కాస్త భిన్నం. సినిమాలో ఉపయోగించిన ఏదో ఒక వస్తువు, లేదా మేకప్ కిట్‌తో వెరైటీగా రివ్యూ చెబుతాడు. చిన్న స్కిట్‌లా చేసి సినిమా పాయింట్‌ను కనెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు ఆ పాయింట్లు భలే పేలుతాయి. కొంత మంది తిట్టుకుంటే, మరి కొంత మంది బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం.. జరిగినా సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ మాత్రం వస్తుంది. అది జరిగితే చాలు.. వీళ్లు తిట్లను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. సినిమా అంటే అంత ప్రేమ మరి. ప్రశాంత్ లాంటి యువకులను ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లే గుర్తుపడతారనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీ వాళ్లకు ఈ ముఖాలు సుపరిచితమే. ప్రశాంత్ విషయంలో ఇటీవల ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ యువకుడికి ఐ లవ్యూ చెప్పి హగ్ ఇచ్చారు. అందాల తార నిధి.. ‘హీరో’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బ్రుందంతో కలిసి నిజాంపేట మల్లికార్జున థియేటర్‌కు ఆమె వచ్చారు. షో అనంతరం కారులో వెళ్తుండగా.. రివ్యూలు చెప్తూ సందడి చేసే యువకులంతా ఆమె వద్దకు వెళ్లారు. వాళ్లను ఆప్యాయంగా పలుకరించిన నిధి.. ప్రశాంత్‌ను దగ్గరకు పిలుచుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. నిధికి అతడు ఐ లవ్ యూ చెప్పగా.. ఆమె కూడా ఐ లవ్ యూ అన్నారు. ఒక్క హగ్ ఇవ్వండి మేడమ్ అంటే.. కారులో నుంచే అతడికి హగ్ ఇచ్చారు. నిధి అగర్వాల్‌కు ఇతడు పెద్ద అభిమాని. అభిమాన నటి హగ్ ఇస్తే.. ఆ సంతోషం మామూలుగా ఉంటుందా?! ఇక.. ప్రస్తుత వీడియో ‘’ సినిమా షూటింగ్‌కి సంబంధించింది. తిప్పోజు దివ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ ఓ పాత్రలో కనిపించనున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KteG6l

Friday, 21 January 2022

Vodafone Idea (Vi) Subscriber Base Declines by Nearly 2 Crore YoY

Vodafone Idea (Vi) reported widening of its consolidated loss to Rs 7,230.9 crore for the third quarter ended December 2021.

from NDTV Gadgets - Latest https://ift.tt/3rYt1zl

Jio Says 5G Coverage Planning Completed for 1,000 Cities

Jio posted an 8.8 percent increase in net profit at Rs 3,795 crore for the third quarter ended December 2021.

from NDTV Gadgets - Latest https://ift.tt/3tPqvOq

ముంబైలో పూజా హెగ్డే ల‌గ్జ‌రీ హౌస్‌ .. గృహ ప్రవేశం చేసిన బ్యూటీ

కర్ణాటకకు చెందిన తుళు బ్యూటీ కల నేరవేరింది. ఈ విషయాన్ని ఆమె వివ‌రిస్తూ ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క‌ల‌ను నేర‌వేర్చుకోవ‌డం కోసం ఏడాదిగా ఆమె మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ ఈ అమ్మ‌డి క‌ల ఏంటి? అనే విష‌యాల్లోకి వెళితే, ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిన కూడా వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా ఉంటున్న పూజా హెగ్డేకి ముంబైలో సొంతంగా ఓ ఇంటికి నిర్మించుకోవాల‌నేది క‌ల‌. కానీ ముంబైలో ఇంటిని నిర్మించుకోవ‌డం అంటే ఎంత ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హార‌మో తెలుసుగా.. కోట్ల రూపాయ‌లు కావాలి. అయితే అప్పుడ‌ప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న పూజా హెగ్డే మాత్రం ఎప్ప‌టికైనా త‌న క‌ల‌ను నేర‌వేర్చుకోవాల‌ని బ‌లంగా కోరుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకునే రేంజ్‌కు ఎదిగిన ఈమె ముంబైలో స్థ‌లం కొని ఇంటిని నిర్మించుకుంది. ఏడాదిగా ఆ ఇంటి నిర్మాణ ప‌నుల‌ను కూడా ఆమె ప‌ర్య‌వేక్షిస్తుంద‌ట‌. ఎట్ట‌కేల‌కు ఆ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. ఆ ఇంటిలోకి గృహ ప్ర‌వేశం కూడా చేసింది. ఆ ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే పూజా హెగ్డే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అగ్ర క‌థానాయ‌కులందరితోనూ సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా రేంజ్ మూవీస్‌తోనూ ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మైంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈమె ప్ర‌భాస్‌తో న‌టించిన రాధే శ్యామ్ విడుద‌ల కావాల్సింది. కానీ.. కోవిడ్ ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ జోడీగా న‌టించింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కావాల్సింది. ఏప్రిల్ 1కి వాయిదా ప‌డింది. ఇక త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడైన విజ‌య్ న‌టిస్తోన్న బీస్ట్‌లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్‌. ఇక హిందీలో స‌ర్క‌స్ సినిమాలో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FRUXd5

‘పుష్ప’ సినిమా స్ఫూర్తితో టీనేజ‌ర్స్‌ దారుణం.. చ‌నిపోయిన బాధితుడు!

యువ‌తలో స్ఫూర్తి నింపే మాధ్య‌మాల్లో సినిమా ఒక‌టి. అందుకే సినిమాను చాలా మంది శ‌క్తివంత‌మైన మాధ్య‌మంగా సూచిస్తుంటారు. సినిమాల్లో చూపించే అంశాల‌ను ప‌రిశీలిస్తే మంచి, చెడు..రెండూ క‌నిపిస్తాయి. వాటిలో యువ‌త మంచిని స్ఫూర్తిగా తీసుకుంటే స‌మాజానికి మేలు జ‌రుగుతుంది. అదే చెడుకి ఆకర్షితుడైతే స‌మాజానికి చెడే జ‌రుగుతుంది. ఇప్పుడు రీసెంట్‌గా విడుద‌లైన టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ ది రైజ్‌, ఓ హిందీ వెబ్ సిరీస్‌లోని చెడు వైపుకి ఆక‌ర్షితులైన ముగ్గురు టీనేజ‌ర్స్ ఓ వ్య‌క్తి చావుకు కార‌ణం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జ‌హంగీర్‌పుర్‌లో గాయాల పాలైన శిబు అనే యువ‌కుడు బాబు జ‌గ్గీవ‌న్ రామ్ ఆసుప‌త్రిలో చ‌నిపోయారు. కేసును విచారించే క్ర‌మంలో పోలీసులు ఊహించ‌ని నిజాలు తెలిసి త‌ల‌లు ప‌ట్టుకున్నారు. అస‌లు ఏం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే.. జ‌హంగీర్ పూర్‌లో బ‌స్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్స్ బ‌ద్నాం పేరుతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. పాపులారిటీ సంపాదించాల‌నే కోరిక‌తో ఆ ఏరియాలోని ఇత‌రుల‌ను బెదిరిస్తూ వాటిని వీడియోలుగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వ‌చ్చారు. తాజాగా ఈ బ‌ద్నాం గ్యాంగ్ పుష్ప సినిమా చూసి నెక్ట్స్ రేంజ్‌కు ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం శిబు అనే అమాయ‌కుడిని టార్గెట్ చేశారు. శిబుని బద్నాం గ్యాంగ్ చిత‌బాద‌డ‌మే కాకుండా వీడియో తీసింది. ఇక లాభం లేద‌ని భావించిన స్థానికులు వారిని చెద‌ర‌గొట్టి శిబుని బాబు జ‌గ్గీరామ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే శిబు హాస్పిట‌ల్లో చికిత్స తీసుకుంటూ మ‌ర‌ణించాడు. అత‌ని బంధువులు ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసుని విచార‌ణ చేశారు. ఆ క్ర‌మంలో అక్క‌డున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బ‌ద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. విచార‌లో వారు పుష్ప ది రైజ్ సినిమాతో పాటు బౌకాల్ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా ఎదిగాల‌నుకున్నామ‌ని స‌ద‌రు నేరం చేసిన టీనేజ‌ర్స్ చెప్ప‌డంతో విస్తు పోయారు పోలీసులు. ఈ ముగ్గురు టీనేజర్స్ కూడా మైనర్స్ కావడం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FMT6Gd

Thursday, 20 January 2022

Jio Signs Pact With Estonian University for 6G Collaboration

Jio's Estonia arm and University of Oulu have signed an agreement to collaborate for development of 6G technology as well as to foster entrepreneurship.

from NDTV Gadgets - Latest https://ift.tt/3Kv6en1

Twitter Debuts Hexagon-Shaped NFT Profile Pictures

Twitter announced the launch of a tool through which users can showcase non-fungible tokens (NFTs)as their profile pictures, tapping into a digital collectibles craze that has exploded over the past...

from NDTV Gadgets - Latest https://ift.tt/3o6yl2v

విడాకుల అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేసిన స‌మంత‌.. చై, సామ్ మళ్లీ కలుస్తున్నారా !

టాలీవుడ్‌లో మోస్ట్ క్యూటెస్ట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైత‌న్య, స‌మంత‌ల‌ను చూసి వారి ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ ఎంత‌గానో మురిసిపోయేవారు. అయితే అది గ‌త ఏడాది అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు మాత్ర‌మే. అక్టోబ‌ర్ 2న చైతు, సామ్ విడిపోతున్న‌ట్లు వారి వారి అధికారిక సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచారు. ఇది వారిని ప్రేమిస్తున్న‌, అభిమానిస్తున్న వారికే కాదు, వారి స్నేహితుల‌కు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కూడా షాకింగ్‌గా అనిపించింది. కొన్ని రోజుల వ‌ర‌కు ఇద్ద‌రు ఫోన్స్‌కు కూడా దొర‌క్కుండా ఉండిపోయారు. ఇప్పుడు క్ర‌మంగా ఎవ‌రి లైఫ్‌లు వారు లీడ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే రీసెంట్‌గా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేశారు. దీంతో అంద‌రూ అస‌లు స‌మంత అలా ఎందుకు చేసిందంటూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ ఏమైనా క‌లుసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారా? అందుకే స‌మంత అలా చేసిందా? ఇలాంటి ఆలోచ‌న‌లు కూడా రాక మాన‌వు. అయితే నాగ‌చైత‌న్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం డివోర్స్ స్టేట్‌మెంట్ క‌నిపిస్తుంది. ఒక‌వేళ ఇద్ద‌రూ క‌లిసి పోవాల‌నుకుంటే చైత‌న్య కూడా డిలీట్ స‌ద‌రు స్టేట్‌మెంట్‌ను డిలీట్ చేయాలిగా.. కానీ అలా జ‌ర‌గ‌లేదు. స‌మంత ఇన్‌స్టాలో స్టేట్‌మెంట్ మాత్రం డిలీట్ అయ్యింది. ఇక్కడ అస‌లు విష‌య‌మేమంటే.. స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్ర‌క‌ట‌న నోట్‌ను డిలీట్ చేశార‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా బంగార్రాజు సినిమాతో నాగ చైత‌న్య భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించారు. దీని త‌ర్వాత ఈయ‌న న‌టించిన థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టించారు. త్వ‌ర‌లోనే ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌లోనూ నాగ చైత‌న్య న‌టించ‌బోతున్నారు. స‌మంత విషయాన్ని చూస్తే.. ఆమె తొలిసారి పుష్ప ది రైజ్ సినిమా కోసం ఐటెమ్ సాంగ్‌లో న‌టించింది. ఇక య‌శోద వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ న‌టించ‌డానికి స‌మంత ఓకే చెప్పింది. ఈ సినిమాల‌న్నీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. మ‌రో వైపు.. బాలీవుడ్‌లోనూ స‌మంత ఎంట్రీ ఇవ్వ‌నుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nLExwn

'Nifty can rally to 20,000 in 2022'

'India has entered an economic super-cycle driven by a housing cycle turnaround.'

from rediff Top Interviews https://ift.tt/3qMPzUd

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందంటూ రూమ‌ర్స్‌... ఖండించిన డైరెక్ట‌ర్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉండ‌గానే ఆయ‌న మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. ఆ ద‌ర్శ‌కుడే శివ నిర్వాణ‌. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన ఈ డైరెక్ట‌ర్ మూడో చిత్రంగా నానితో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సినిమా చేశారు. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుద‌లైంది. అయితే ఆశినంత హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది. ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉండ‌టం.. సినిమా గురించి ఊసు లేక‌పోవ‌డం ఒక వైపు.. అలాగే మ‌రో వైపు, ఇటీవ‌ల సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ఘ‌న విజ‌యం సాధించిన త‌రుణంలో.. 2023 అద‌ర‌గొట్టేద్దాం అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ట్ కావ‌డంతో విజ‌య్ త‌దుప‌రి సుకుమార్‌తోనే సినిమా చేస్తార‌ని టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ సినిమా నుంచి త‌ప్పుకున్నారంటూ వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతే కాకుండా సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో శివ నిర్వాణ సినిమా చేయ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ శివ నిర్వాణ సోష‌ల్ మీడియా ద్వారా నేరుగా స‌మాధానం చెప్పారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌న సినిమా ఆగిపోయిందని, తాను నెక్ట్స్ మూవీని వెంక‌టేష్‌తో చేయ‌బోతున్నానంటూ వినిపిస్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెబుతూ నెట్టింట త‌న సినిమా గురించి వినిపిస్తోన్న వార్త‌లు అవాస్త‌వం ఆయ‌న తేల్చేశారు. దీంతో శివ నిర్వాణ త‌దుప‌రి సినిమాకు సంబంధించిన రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. లేటెస్ట్ మూవీ ‘లైగర్’ పాన్ ఇండియా రేంజ‌లో విడుదలవుతుంది. మరి శివ నిర్వాణతో మన రౌడీ స్టార్ పాన్ ఇండియా సినిమాను చేస్తారా? లేక టాలీవుడ్‌కి సంబంధించిన సినిమానే చేస్తారా అని తెలియడం లేదు. మరో వైపు పూరీ జగన్నాథ్ తర్వాత విజయ్ దేవరకొండ కోసం మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెయిట్ చేస్తున్నారు. మరి మర రౌడీ హీరో ఓటు ఎవరికో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qNALEX

Pawan Kalyan : ‘హరి హర వీర మల్లు’ కోసం భారీ సెట్స్!

వ‌ప‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘’. ఇది పీరియాడిక్ మూవీ. మొఘలుల నేపథ్యంలో సాగే కథ. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ బందిపోటు పాత్ర‌లో క‌నిపిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌కి సంబంధించి షూటింగ్ కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేస్తున్నారు. మొఘ‌లుల కాలంలో ఢిల్లీ వాణిజ్య ప్రాంత‌మైన చాందినీ చౌక్ ప్రాంతాన్ని సెట్స్ రూపంలో ఇక్క‌డ సిద్ధం చేస్తున్నారు. పవ‌న్ క‌ళ్యాణ్ రెండు సినిమాల్లో భీమ్లా నాయక్ దాదాపు వ‌ర్క్ అంతా కూడా పూర్త‌య్యింది. కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. అది పూర్త‌యిన త‌ర్వాత ‘హరి హర వీర మల్లు’పై ప‌వ‌న్ ఫోక‌స్ పెడుతారు. ఇప్ప‌టికే స‌గానికి పైగా సినిమా పూర్తి కావ‌డంతో మిగిలిన భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేసేలా ముందు నుంచి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. అందుకోస‌మే ఇందులో బాలీవుడ్‌కి చెందిన న‌టీన‌టుల‌ను న‌టింప చేశారు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. ఓ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కాగా.. మ‌రో హీరోయిన్‌గా న‌ర్గీస్‌ ఫ‌క్రి న‌టంచే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అలాగే మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తిగా అర్జున్ రాంపాల్ న‌టిస్తున్నారు. ఎ.ఎం.ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రో వైపు భీమ్లా నాయ‌క్ సినిమాను శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సినిమా షూటింగ్ పూర్త‌యినంత వ‌ర‌కు, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కంప్లీట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పండగ సాయన్న అనే బందిపోటుని అప్పటి ప్రజలు రాబిన్ హుడ్‌‌గా భావించేవారు. ఆయన పాత్ర ఆధారంగానే ‘హరి హర వీర మల్లు’ పాత్రను డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు. నిధి అగర్వాల్ ఇందులో పంచమి అనే దొంగ పాత్రలో కనిపించనుందట. మరో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి.. మొఘలు యువరాణి పాత్రలో మెరవనుందని సమాచారం. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KrhTTQ

'UP BJP is fed up of Yogi's dictatorial ways'

'Scores of important BJP MLAs are in touch with Akhileshji, but he has very humbly said that the SP's doors are now closed to BJP MLAs and leaders.'

from rediff Top Interviews https://ift.tt/3o6mQIn

Wednesday, 19 January 2022

Samayam Telugu Awards 20 -21: ‘స‌మ‌యం తెలుగు’ అవార్డ్స్ 2020-21.. ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ

సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌రోనా వైరస్ చాలా దెబ్బ తీసింది. దాదాపు రెండేళ్లుగా అనుకున్న స‌మ‌యంలో సినిమాలు థియేట‌ర్స్‌లో సందడి చేయ‌లేదు. క‌రోనా రెండు వేవ్స్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. మ‌ళ్లీ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డగానే థియేట‌ర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేశాయి. వీటిలో కొన్ని సినిమాలు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌గా.. మ‌రికొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్నాయి. ఏదేమైనా 2020-21 ఏడాదికిగానూ సినీ ప్రేమికుల‌కు ఆనందాన్ని అందించిన చిత్రాల్లో ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ప్ర‌తినాయ‌కుడు, ఉత్త‌మ న‌టి, మేల్ సింగ‌ర్‌, ఫిమేల్ సింగ‌ర్‌, సంగీత ద‌ర్శ‌కుడు.. ఎవ‌రు? అనే విష‌యంపై ప్రేక్ష‌కుల అభిప్రాయాల‌ను ఓటింగ్ ప‌ద్ధ‌తి ద్వారా తీసుకుని విజేత‌ల‌ను నిర్ణ‌యిస్తున్న ‘స‌మ‌యం తెలుగు’ అవార్డ్స్‌ను ప్ర‌క‌టించారు. ఆ వివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం... ఉత్త‌మ చిత్రం : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ చిత్రం కేట‌గిరిలో ఉత్త‌మ చిత్రం పోటీ ప‌డ్డ చిత్రాలు అఖండ‌, వ‌కీల్ సాబ్‌, జాతి ర‌త్నాలు, క్రాక్‌. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి.. వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఇందులో అఖండ ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. అఖండ - 44 %, జాతి ర‌త్నాలు - 33%, వ‌కీల్ సాబ్ - 19%, క్రాక్ - 4% ఓట్ల‌ను ద‌క్కించుకున్నాయి. ఉత్త‌మ న‌టుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో బాల‌కృష్ణ (అఖండ‌), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (వ‌కీల్ సాబ్‌), వెంక‌టేష్ (నార‌ప్ప‌, దృశ్యం 2), ర‌వితేజ (క్రాక్‌) పోటీ ప‌డితే, నంద‌మూరి బాల‌కృష్ణ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. బాల‌కృష్ణ - 47 %, ప‌వ‌న్ క‌ళ్యాణ్ - 24 %, వెంక‌టేష్ - 23 %, ర‌వితేజ - 6% ఓట్ల‌ను ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ న‌టి : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ న‌టి కేట‌గిరిలో సాయి ప‌ల్ల‌వి (ల‌వ్ స్టోరి ), కృతి శెట్టి (ఉప్పెన‌), పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌), శ్రుతి హాస‌న్ (క్రాక్‌), సునైన (రాజ రాజ చోర‌) పోటీ ప‌డ‌గా అందులో సాయిప‌ల్ల‌వి విజేత‌గా నిలిచారు. సాయి ప‌ల్ల‌వి - 61, కృతి శెట్టి -25, పూజా హెగ్డే - 7%, శ్రుతి హాస‌న్ - 4 %, సునైన -3 % ఓట్ల‌ను పొందారు. ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు: స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు కేట‌గిరిలో శ్రీకాంత్ (అఖండ‌), స‌ముద్ర ఖ‌ని (క్రాక్‌), ర‌మ్య‌కృష్ణ (రిప‌బ్లిక్‌), ర‌విబాబు (రాజ రాజ చోర‌) పోటీ ప‌డగా శ్రీకాంత్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఓటింగ్‌లో శ్రీకాంత్ -63 %, స‌ముద్ర ఖ‌ని - 24 %, ర‌మ్య‌కృష్ణ - 11%, ర‌వి బాబు - 2% శాతం ఓట్ల‌ను ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ విభాగంలో బోయ‌పాటి శ్రీను (అఖండ‌), విజ‌య్ కుమార్ క‌న‌క మేడ‌ల (నాంది), అనుదీప్ (జాతి ర‌త్నాలు), గోపీచంద్ మ‌లినేని ( క్రాక్‌), వేణు శ్రీరామ్ (వ‌కీల్ సాబ్‌), హ‌సిత్ గోలి (రాజ రాజ చోర‌) పోటీ ప‌డ‌గా బోయ‌పాటి శ్రీను విన్న‌ర్‌గా నిలిచారు. ఇందులో బోయపాటి శ్రీను 43 శాతం ఓట్ల‌ను సొంతం చేసుకుని మొది స్థానంలో నిలిచారు. ఉత్తమ సంగీత ద‌ర్శ‌కుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు విభాగంలో త‌మ‌న్ (అఖండ‌, వ‌కీల్ సాబ్‌, క్రాక్‌), దేవిశ్రీ ప్ర‌సాద్ (ఉప్పెన‌), ప‌వ‌న్ సి.హెచ్ (ల‌వ్ స్టోరి), గోపి సుంద‌ర్ (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌), మ‌ణిశ‌ర్మ (నార‌ప్ప‌, సీటీమార్‌) పోటీ ప‌డ‌గా.. త‌మన్ 56 శాతం ఓట్ల‌ను సొంతం చేసుకుని మొద‌టి స్థానంలో నిలిచారు. ఉత్త‌మ మేల్ సింగ‌ర్ : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ మేల్ సింగ‌ర్ విభాగంలో సిద్ శ్రీరామ్ (నీలి నీలి ఆకాశం, మ‌గువ మ‌గువ‌..), అనురాగ్ కుల‌క‌ర్ణి (చుక్క‌ల చున్ని, నీ చిత్రం చూసి), జావెద్ అలీ (నీ క‌న్ను నీలి స‌ముద్రం), అర్మాన్ మాలిక్ ( కంటిపాప కంటిపాప‌), కాళ భైర‌వ (ఇంకో సారి ఇంకోసారి) పోటీ ప‌డ‌గా.. సిద్ శ్రీరామ్ 59 శాతం ఓట్లు ద‌క్కించుకుని మొదటి స్థానంలో నిలిచారు). ఉత్త‌మ ఫిమేల్ సింగ‌ర్ : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ ఫిమేల్ సింగ‌ర్ విభాగంలో మంగ్లీ (సారంగ ద‌రియా), శ్రేయా ఘోష‌ల్ (ఇంకోసారి ఇంకోసారి), హ‌రి ప్రియ (ధ‌క్ ధ‌క్‌), చిన్న‌యి (మ‌న‌సులోనే నిలిచ‌పోవే) పోటీ ప‌డ‌గా.. 75 శాతం ఓట్ల‌ను ద‌క్కించుకుని మంగ్లీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33tYCRd

నిధి కోసం మళ్లీ హీరో కావాలనుంది.. జగపతి బాబు కామెంట్స్ వైరల్

'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'ఇస్మార్ట్ శంకర్‌' మూవీతో భారీ క్రేజ్ సంపాదించింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకొని వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా కొత్త హీరో అశోక్ గల్లాతో 'హీరో' సినిమా చేసి పలువురు ప్రశంసలందుకుంటోంది. ఈ మూవీలో నిధి గ్లామర్ షో స్పెషల్ అట్రాక్షన్ అయింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్, ప్రమోషన్ కార్యక్రమాల్లో పలువురు సినీ ప్రముఖులు నిధి అగర్వాల్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన హీరో థాంక్స్ మీట్‌లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌పై సీనియర్ హీరో చేసిన కామెంట్స్, అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. నిధి కోసం తనకు మళ్లీ హీరో కావాలనే కోరిక పుట్టిందంటూ అందరి ముందే ఓపెన్ అయ్యారు జగపతి బాబు. అంతేకాదు నిధి అందాన్ని తెగ పొగిడేస్తూ మాట్లాడిన ఆయన.. థియేటర్లలో నిధి అగర్వాల్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పారు. ఇక మరో సీనియర్ నటుడు నరేష్ కూడా నిధి అగర్వాల్ క్రేజ్ చూస్తుంటే తనకు మరో జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని చెప్పడం గమనార్హం. నిధి అంటే సంపద అని, ఆమె నటించిన ప్రతి సినిమా నిర్మాతలకు లాభాల పంట పండిస్తోందని బ్రహ్మాజీ పొగిడేశారు. ఇలా సీనియర్ నటుల పొగడ్తలు విని సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్యూచర్‌లో విలక్షణ పాత్రలతో అలరిస్తానని అంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rD0QFX

వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు.. ధనుష్ తండ్రి రియాక్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, అల్లుడు ఐశ్వర్య రజినీకాంత్- తమ 18 ఏళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి పలికిన సంగతి తెలిసిందే. ఇంతటితో తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ఐశ్వర్య, ధనుష్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించి సినీ లోకాన్ని ఆశ్చర్యపరిచారు. దీంతో ఐశ్వర్య- ధనుష్ డివోర్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ డివోర్స్‌కి కారణాలేంటి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోతున్నారనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి రియాక్ట్ అయ్యారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ధనుష్- ఐశ్వర్యల బ్రేకప్‌పై స్పందించిన కస్తూరి రాజా.. వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమైన విషయం. అలాంటి మనస్పర్థలే ధనుష్, ఐశ్వర్య మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. విడాకుల విషయమై ఇద్దరితో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సలహాలు, సూచనలిచ్చా. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయంపై మరోసారి ఆలోచించమని వారిద్దరిని కోరారు. మరోవైపు పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కోరుతున్నారని కస్తూరి రాజా అన్నారు. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య 2004 న‌వంబ‌ర్ 18న పెద్దల సమక్షంలో ధనుష్‌ని పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్‌ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయంటూ ఈ విడాకుల ఇష్యూపై రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358wrHR

'I was shocked to hear communal things from the CM'

'TMC was calling me, AAP was also calling me.'

from rediff Top Interviews https://ift.tt/3rRVB5p

Tuesday, 18 January 2022

AT&T, Verizon Pause 5G Rollout Near US Airports

AT&T and Verizon agreed to temporarily defer turning on some wireless towers near key airports to avert a significant disruption to US flights as they roll out 5G service that will bring faster...

from NDTV Gadgets - Latest https://ift.tt/3qEd1mh

'Investors should trim expectations'

'We would advise investors to invest in a disciplined way in equities for the long term.'

from rediff Top Interviews https://ift.tt/3nF35XR

Air India Curtails US Operations Due to 5G Deployment

Air India has curtailed its operations to the US from India in view of deployment of 5G communications by the United States.

from NDTV Gadgets - Latest https://ift.tt/33qpQIr

ఒక్క ఛాన్స్ ప్లీజ్..! బాలకృష్ణపై రామ్ గోపాల్ వర్మ కన్ను.. నేరుగా ఆ మాట అడిగేస్తూ!

నిజాయితీగా ఉండటం, ముక్కుసూటిగా మాట్లాడటం, కోపం వస్తే నోటికి చేతికి పని చెప్పడం బాలయ్య బాబు నైజం. ప్రతి విషయాన్ని లోతుగా కూలంకషంగా పరిశీలించడం, అందులోని లాజిక్స్ వెలికి తీస్తూ ఎవ్వరూ ఊహించని పాయింట్ బయటకు తీయడం, దానిపై విమర్శనాత్మక కోణంలో సెటైర్స్ వేయడం స్టైల్. మరి ఈ ఇద్దరూ ఎదురెదురుగా ఒకే వేదికపై తారసపడితే ఇక ఆ సీన్ ఊహించుకోండి ఎలా ఉంటుందో!. సరిగ్గా అదే టార్గెట్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ. ఆహా ఓటీటీ వేదికపై అంటూ యమ స్పీడుగా దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన కట్టు బొట్టు, మాట విధానానికి ఆన్ లైన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎదురుగా సెలబ్రిటీలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్న విధానం, ఆయన సంధించే ప్రశ్నల వర్షం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆహా వేదికపై ఈ షోకి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను ఈ షోపై పడింది. ఇంకేముంది తన సోషల్ మీడియా అస్త్రం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ వేసుకున్నారు. అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఆర్జీవీ.. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తనకు కూడా ఆ షోలో పాల్గొనాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు వర్మ. బాలకృష్ణ గారు నాకో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కాకపోతే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశారు వర్మ. బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని లాంటి డైరెక్టర్లు సహా పలువురు నటీనటులను ఇంటర్వ్యూస్ చేశారు. మరి వర్మ కోరుకున్నట్లే బాలయ్య బాబు గానీ, ఆహా టీమ్ గానీ ఆయనతో స్కెచ్చేస్తే ఇక ఆ కిక్కు మామూలుగా ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tFC3Um

'Kohli deserved better'

'Believe me, Virat will go out of his way to make the new captain comfortable.'

from rediff Top Interviews https://ift.tt/3tyUEkO

ధనుష్- ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే? రజినీకాంత్ ఎంత వరకు ఎంటరయ్యారు? జనాల్లో ముదిరిన చర్చలు

సెలబ్రిటీ కపుల్స్ విడాకుల ఇష్యూస్ ఒక్కొక్కటిగా బయటకొస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్‌గా చై-సామ్ డివోర్స్ మ్యాటర్ హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు సూపర్ స్టార్ కూతురు, అల్లుడు ఐశ్వర్య రజినీకాంత్- తమ 18 ఏళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి పలకడం ఒకింత అందరికీ షాకిచ్చినట్లయింది. తామిద్దరం విడిపోతున్నామని అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ అధికారికంగా తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి అని ధనుష్ కోరారు. అయితే ఊహించని విధంగా ఐశ్వర్య రజినీకాంత్- ధనుష్ విడాకుల ప్రకటన రావడం జనాల్లో పలు చర్చలకు తావిచ్చింది. ఈ జోడీ ఇన్నేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సినంత బలమైన కారణం ఏముంది అనే దానిపై చర్చలు షురూ అయ్యాయి. సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్‌.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అంతేకాదు ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసి భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం డివోర్స్ దాకా దారి తీసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ధనుష్- ఐశ్వర్య మధ్య నెలకొన్న మనస్పర్థల గురించి రెండు నెలల క్రితమే తెలుసుకున్న రజినీకాంత్.. ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా ప్రయత్నం చేశారట. కానీ ఎంతకూ ఇద్దరూ వినకపోవడంతో చివరకు ఇష్యూ విడాకుల దాకా వచ్చిందని కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య 2004 న‌వంబ‌ర్ 18న పెద్దల సమక్షంలో ధనుష్‌ని పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఈ దంపతుల మధ్య ఇన్నేళ్ల పాటు రాని మనస్పర్థలు 18 సంవత్సరాల తర్వాత ఇలా రావడం, డివోర్స్ దాకా వెళ్లడాన్ని కోలీవుడ్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qHCqfc

Monday, 17 January 2022

How to Pre-Order PlayStation 5's First Restock of 2022 in India

PS5 India January 18 restock - for Rs. 49,990 Blu-ray PlayStation 5 - available at Amazon, Croma, Flipkart, Game Loot, Games The Shop, Reliance Digital, Sony Center ShopAtSC, and Vijay Sales.

from NDTV Gadgets - Latest https://ift.tt/328AmDr

'Hatred is not going to stop'

'Unfortunately, our political class is not interested in making this society equal. They just want to exploit the situation for their own benefit.'

from rediff Top Interviews https://ift.tt/3tA1XbT

OnePlus Buds Z2 to Go on Sale in India Today: All Details

OnePlus Buds Z2 TWS earphones will go on sale in India today for the first time. They are priced at Rs. 4,999 and will be available online on Flipkart, Amazon, OnePlus online store as well as partner...

from NDTV Gadgets - Latest https://ift.tt/34NZjVx

డబ్బులతో పారిపోయిన జూనియర్ ఆర్టిస్ట్.. అద్దాలు తుడిచిన టాలీవుడ్ కమెడియన్

సినీ ప‌రిశ్ర‌మ‌లో బ‌య‌ట‌కు క‌నిపించే జిగేల్ మ‌నే వెలుగులు వెనుక ఎంతో క‌ష్టం ఉంటుంది. ఓ న‌టి లేదా న‌టుడో ఓ మంచి స్థాయికి రావ‌డానికి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించాల్సి ఉంటుంది. వాట‌న్నింటికీ ఎదురొడ్డి నిలిచిన‌ప్పుడే గుర్తింపు దొరుకుతుంది. పేరొస్తుంది. అలాంటి ఎన్నో క‌ష్ట నష్టాల‌ను ఓర్చి ఎదిగిన వ్య‌క్తే క‌మెడియ‌న్ స‌త్య‌. హైద‌రాబాద్ వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌త్య‌.. సినిమాల మీద మ‌క్కువ‌తో ఇంజ‌నీరింగ్‌ను స‌గంలోనే ఆపేసి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు. ఆ స‌మ‌యంలో తండ్రి త‌న‌కు 10 వేల రూపాయ‌ల‌ను ఇచ్చార‌ట‌. ఆ డ‌బ్బులు అయిపోయిన త‌ర్వాత క‌మెడియ‌న్ స‌త్య‌కు అస‌లు ఇబ్బందులు మొద‌ల‌య్యాయ‌ట‌. డ‌బ్బుల కోసం ఓ ఆసుప‌త్రిలో అద్దాల‌ను తుడిచార‌ట స‌త్య‌. దానికి ఆయ‌న‌కు రోజుకి రెండు వంద‌లు ఇచ్చేవార‌ట‌. త‌ను ప‌నిచేసే చోట ఓ ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిసులు ప‌రిచ‌యం అయ్యారు. వారు చెప్పిన చోట‌కి షూటింగ్ చూడ‌టానికి వెళ్తే .. అక్క‌డ ఐదు వంద‌ల రూపాయ‌లు తీసుకుని షూటింగ్ చూడ‌టానికి పంపార‌ట‌. ఆ స‌మ‌యంలో మ‌రికొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. ఓసారి ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ స‌త్య ద‌గ్గ‌రున్న డ‌బ్బులు తీసుకుని పారిపోయార‌ట‌. చివ‌ర‌కు డ‌బ్బులు లేక‌పోతే, మూడు రోజుల పాటు నీళ్లు తాగి ఆక‌లి తీర్చుకున్నార‌ట స‌త్య‌. త‌ర్వాత తన ఇబ్బందుల‌ను త‌ల్లికి ఫోన్లో వివ‌రించార‌ట‌. చివ‌ర‌కు తెలిసిన వాళ్ల స్నేహితుల ద్వారా ద్రోణ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేరార‌ట స‌త్య‌. అలా కొన్ని రోజులు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన త‌ర్వాత న‌టుడిగా మారారు. ఇప్పుడు క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qCpxTC

'Huge impact on livelihoods over two years'

'It's important to find that balance between lives and livelihoods, make sure that we protect lives while ensuring that the economic recovery is back on track.'

from rediff Top Interviews https://ift.tt/3nwDPmQ

Realme 9i Set to Launch in India Today: How to Watch Livestream

Realme 9i launch in India is taking place today (Tuesday, January 18). Here's how you can watch its livestream and what all will be the expected price and specifications of the Realme phone.

from NDTV Gadgets - Latest https://ift.tt/33sMVdo

Aishwaryaa Rajinikanth : ధ‌నుష్ - ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ విడాకులు

కోలీవుడ్ హీరో ధ‌నుష్‌, త‌మిళ సూప‌ర్ స్టార్ కుమార్తె ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికారు. అధికారికంగా విడిపోతున్నామని త‌మ త‌మ అధికారిక‌ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. ‘‘స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. ఇప్పుడు మా దారులు వేర‌య్యాయి. వాటిలో ప్ర‌యాణించ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. నేను, ఐశ్వ‌ర్య విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా వ్య‌క్తిగ‌త స‌మ‌యాన్ని వెచ్చించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా నిర్ణ‌యాన్ని గౌర‌వించండి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి’’ అని ధ‌నుష్ లేఖ‌లో పేర్కొన్నారు. అలాంటి లేఖ‌నే ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ కూడా పోస్ట్ చేశారు. ఐశ్వ‌ర్య‌.. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె. 2004 న‌వంబ‌ర్ 18న వీరిద్ద‌రూ పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర‌, లింగ .. ఇద్ద‌రు కుమారులున్నారు. ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలిగా, సింగ‌ర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంతో అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్న‌వారే. 3, వ‌య్ రాజా వ‌య్ చిత్రాల‌తో పాటు సినిమా వీర‌న్ అనే డాక్యుమెంట‌రీని డైరెక్ట్ చేశారు. యుగానికొక్క‌డు సినిమా త‌మిళ వెర్ష‌న్ ఆయ‌ర‌త్తిల్ ఒరువ‌న్‌కు ఈమె డ‌బ్బింగ్ చెప్పారు. ఇదే సినిమాలో పాట కూడా పాడారు. అలాగే విజిల్ సినిమాలోనూ ఓ పాట‌ను ఆల‌పించారు. ఇక హీరో ధ‌నుష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈయ‌న సుప‌రిచితుడే. ఇప్పుడు తెలుగులో రెండు స్ట్ర‌యిట్ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో సార్ అనే సినిమా, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నాయి. సార్ అనే సినిమా షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ALSO READ :


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fyMhgT

The PT Teacher Behind Two WPL Stars

'Today when I see them talking to people from different countries confidently, I realise that education does not come from classrooms al...