Sunday, 1 August 2021

Friendship Day 2021 : ఒక్కొక్కరిపై ఒక్కోలా సమంత కామెంట్.. ఐ లవ్యూ చెప్పిన ప్రీతమ్!!

వ్యవహారం ఎప్పుడూ కూడా ఒకింత ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో చెప్పడం కష్టమే. ఈ మధ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరు మార్చేసుకున్నారు. సమంత అక్కినేని అని ఉండాల్సిన ఆ మొత్తాన్ని తీసేసి కేవలం యస్ అనే ఒక్క అక్షరాన్నే పెట్టుకున్నారు. అయితే ఆ యస్ అంటే సమంత అని అర్థమా? లేదా తాను నటించబోతోన్న శాకుంతలం సినిమా అని అర్థమా? లేదా ఇంకేదైనా నిగూఢ అర్థమా? తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. అలా సమంత ఎప్పుడూ ఏదో ఒక పజిల్‌ను వదులుతూ ఉంటారు. సమంత ఆ మధ్య తన డిజైనర్‌ ప్రీతమ్ జుకాల్కర్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. అందులో సమంత తన కాళ్లను ప్రీతమ్ ఒళ్లో వేయడం, ఇద్దరూ కలిసి సోఫాలో కూర్చోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత విషయం చేజారిపోతోందని గమనించిన సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేశారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆ ఇద్దరి మధ్య అలాంటి బంధమేమీ లేదు. సమంతను ప్రీతమ్ సోదరి భావంతోనే చూస్తారు. ఆ మధ్య సమంత బర్త్ డే సందర్భంగా ప్రీతమ్ పెట్టిన పోస్ట్‌లో ఆమెను సోదరి అనే సంబోధించారు. ఇప్పుడు కూడా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సమంత తన లైఫ్‌లోని ఫ్రెండ్స్ గురించి చెబుతూ ఒక్కొక్కరి మీద ఒక్కోలా కామెంట్ చేశారు. నందినీ రెడ్డిని గైడ్‌గా చెప్పుకొచ్చారు. శిల్పారెడ్డిని తన ప్రతిబింబంగా అభివర్ణించారు సమంత. అలా ప్రీతమ్‌ను హోమ్ అని అన్నారు. ఆయన దగ్గర ఉంటే ఇంట్లో ఉన్నట్టు.. ఇంటి మనిషిలా అనిపిస్తుందన్నట్టుగా పేర్కొన్నారు. సమంత కురిపించిన ప్రేమకు ప్రీతమ్ ఎమోషనల్ అవుతూ ఐ లవ్యూ సోదరి అని చెప్పేశారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C348GB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....