Monday, 24 May 2021

RGV: ఆ మాట చెప్పి నన్ను మొత్తం వాడేసుకున్నారు.. స్టార్ హీరోల కోసం! రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక అంశం వివాదాస్పదమవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా , లాంటి సెలబ్రిటీలు బోల్డ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు రాధికా ఆప్టే ఏకంగా వర్మ గురించి, ఆయన తీసిన '' సినిమా గురించి మాట్లాడుతూ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఆ సినిమాలో నటించాలని చెప్పి తనను మోసం చేశారని ఆమె చెప్పుకురావడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఓపెన్ అయింది బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' సినిమాలో నటించాను. గ్రామీణ యువతి పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు చాలా కష్టపడ్డాను. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తుండగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ముందు చెప్పింది ఒకటి.. తీరా సెట్స్ మీదకు వచ్చాక అక్కడ చేసింది మరొకటి అంటూ అప్పటి సంగతులను వివరంగా చెప్పింది రాధికా. ఆ పాత్ర కోసం తనకు చాలా తక్కువ రెమ్మ్యూనరేషన్ చెల్లించారని, కానీ వాడకం విషయంలో మాత్రం ఇష్టానుసారంగా వాడేశారని రాధికా ఆప్టే చెప్పింది. ఈ రోల్ ఆఫర్ చేసే ముందు ఒకే భాషలో తీస్తున్నామని చెప్పి.. షూటింగు సమయంలో తెలుగుతోపాటు తమిళంలో కూడా తీశారని, అలా తనతో డబుల్ వర్క్ చేయించుకున్నారని వాపోయింది. ఒకాకొన సందర్భంలో సినిమా నుంచి తప్పుకుందామా అనే ఫీలింగ్ కూడా కలిగిందని తెలిపింది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ చేస్తున్నపుడు సమయానికి షూటింగ్ స్పాట్‌కి వెళితే అక్కడ షూటింగ్ స్టార్ట్ కాకపోయేదని, స్టార్ హీరోలు నటిస్తున్నారు కాబట్టి వాళ్ళకోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సివచ్చేదని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు తన టాలెంట్‌కి కానీ తన సమయానికి కానీ విలువ లేదనిపించిందని చెప్పింది. టాలీవుడ్‌లో ఫేవరిటిజం, టైమ్‌ను దుర్వినియోగం చేయడం బాగానే కనిపించాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QQBaHq

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD