Tuesday, 25 May 2021

Mugguru Monagallu Trailer: చెవిటి, మూగ, అంధుడితో వెరైటీ కామెడీ.. అలా దర్శనమిచ్చిన TNR

మెయిన్ లీడ్ పోషిస్తున్న కొత్త సినిమా ''. శారీరక లోపంతో ఉన్న ముగ్గురు స్నేహితుల కథను ట్విస్టులు జోడించి ఆసక్తికరంగా మలుస్తూ అభిలాష్ రెడ్డి అనే కొత్త‌ దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తున్నారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నటుడు శ్రీనివాస్ రెడ్డి, కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌ దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియోలో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి కామెడీ చేశారు. హైదరాబాద్‌లో బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరిగిన నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఈ ముగ్గురి సహాయం తీసుకోవడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. ఇటీవలే కరోనాతో కన్నుమూసిన సినీ జర్నలిస్ట్ TNR కూడా ఈ ట్రైలర్‌లో కనిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాతో వెరైటీ కామెడీ పండించబోతున్నారని స్పష్టమవుతోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాజర్, రాజా రవీంద్ర, ట్విషా శర్మ, శ్వేత వర్మ, జెమిని సురేష్, జోష్ రవి, జబర్దస్త్ సన్నీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uhZ1xn

No comments:

Post a Comment

'Portraying Dr Singh Was Challenging'

'I had to make sure that our much misunderstood erstwhile prime minister did not get a raw deal.' from rediff Top Interviews https...