మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటూ సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో చాలా అవసరమని చెబుతోంది హీరోయిన్ అగర్వాల్. దేశంలో కరోనా వీరవిహారం చేస్తున్న సమయంలోనే ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో హనీమూన్ ట్రిప్స్ వేసి కొద్ది రోజులపాటు ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తిరిగి తన సినిమా షూటింగ్స్‌లో జాయిన్ కాగానే మళ్ళీ కరోనా విజృంభణ మొదలైంది. దీంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న కాజల్ తన కాలక్షేపం ఏంటనే దానిపై ఓపెన్ అయింది. ఈ భయానక పరిస్థితుల్లో ఇంట్లోనే ఉంటూ ఏదో పని చేసుకోవడం ద్వారా మాసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని చెబుతోంది కాజల్. ఎవరికివారు తమలో పాజిటివిటీ పెంచుకునేందుకు.. మనసుకు నచ్చిన పని చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చని అంటోంది. పని ఏదైనా కావొచ్చు. సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో చాలా అవసరమని పేర్కొన్న కాజల్.. ''నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతిని కలిగించడంతో పాటు మానసిక క్షేమాన్ని అందిస్తోంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం నిజంగా గొప్ప అనుభూతి. మరి ఈ విరామ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఓ పోస్ట్ చేసింది కాజల్. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌లో మరో నాలుగైదు సినిమాలు కమిటయింది. పెళ్ళయితేనేం.. ఎప్పటిలాగే సినిమాల్లో సత్తా చాటుతా అన్నట్లుగా దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aV7XSh
No comments:
Post a Comment