Sunday, 23 May 2021

సినిమా రౌండప్: బాలయ్య బర్త్ డే గిఫ్ట్.. ఉప్పెన డైరెక్టర్ హింట్! స్టార్ హీరో కోసం సారా..

స్టార్ హీరో కోసం సారా వెయింటింగ్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడికి సౌత్ నుండి కూడా పిలుపు అందిందట. కాకపోతే మంచి, కథ స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే రెడీ అంటోంది సారా. బాలయ్య బర్త్ డే గిఫ్ట్ బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ మూవీ ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న 'అఖండ' టీజ‌ర్‌ విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ హింట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజున బుచ్చిబాబు 'ఎదురుచూస్తున్నా.. ట్రెండ్‌ సృష్టిద్దాం' అంటూ మెసేజ్ చేసి క్లియర్ హింట్ ఇచ్చేశారని అంటున్నారు. నమ్రత స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విశేషాలు పంచుకునే నమ్రత.. తన గారాలపట్టి సితార తీసిన ఓ సెల్ఫీ పిక్ పోస్ట్‌ చేస్తూ.. ''నా చుట్టూ కావలసినంత ప్రేమ ఉంది'' అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. హరహర వీరమల్లు టీజర్ అప్‌డేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ క్రిష్ క్రేజీ కాంబోలో మొగల్స్ కాలం నాటి కథతో రూపొందుతున్న 'హరహర వీరమల్లు' టీజర్ విషయంలో ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bPfDGm

No comments:

Post a Comment

'Neena Gupta And I Would Fight A Lot'

'I need to work to find some joy in this life.' from rediff Top Interviews https://ift.tt/6NQ7yYS