మెగా పవర్ స్టార్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. చెర్రీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్‌తో పాటు రోల్ బాగా హైలైట్ అయింది. రంగమ్మత్తగా వెండితెరపై అనసూయ చూపిన పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో వరుస ఆఫర్స్ పెట్టేస్తూ యమ జోష్‌లో ఉన్న అనసూయ.. రంగస్థలం షూటింగ్ తాలూకు విషయాలపై ఓపెన్ అయింది. రామ్ చరణ్ తన కోసం ప్రత్యేకంగా వంట చేయించేవారని చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ అనేది ఏ ఒక్కరోజుతోనో అయిపోయే తంతు కాదు. నెలలు, సంవత్సరాల తరబడి షూటింగ్ కోసం పలు లొకేషన్స్ తిరుగుతూ రేయింబవళ్లు కష్టపడాల్సి వస్తుంది. అలా లొకేషన్ లోనే భోజనం చేయడం, స్టార్ హీరో అయినా సరే తోటి నటీనటులతోనే ఎక్కువ సమయం గడపడం లాంటివి కామన్. అయితే రంగస్థలం షూటింగ్ సమయంలో రామ్‌చరణ్ మాత్రం తన కోసం ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి వంట చేయించారని చెబుతూ అప్పటి విషయాలు బయటపెట్టింది అనసూయ. సెట్లో భోజన సమయంలో అంతా కలిసి చేపల కూర తినేవారని, అయితే తనకు మాత్రం చేపల కర్రీ తినే అలవాటు లేదని చెప్పింది అనసూయ. ఇది గ్రహించి రామ్‌చరణ్ తన కోసం ప్రత్యేకంగా చెఫ్‌ని పిలిపించి పన్నీర్ కర్రీ చేయించి పెట్టేవారని, అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేదని ఆమె తెలిపింది. అప్పుడు, ఇప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నానని చెప్పిన అనసూయ.. ఓ స్టార్ హీరో తన కోసం అలా చేయాల్సిన అవసరం లేదు కానీ చెర్రీ చేశాడంటూ తెగ మురిసిపోయింది. టీవీ షోస్‌తో పాటు సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ జబర్దస్త్ బ్యూటీ మరికొద్ది రోజుల్లో ‘థాంక్యూ బ్రదర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే7 నుంచి ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలో గర్భవతిగా అనసూయ కనిపించనుంది. దీంతో పాటు 'పుష్ప' సినిమాలో కూడా ఓ కీలకపాత్ర పోషిస్తోంది అనసూయ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QG9F3k
No comments:
Post a Comment