Saturday, 1 May 2021

ఆ లిస్టులోకి చేరిపోయిన చైతు సినిమా.. ఇటలీ నుంచి ఇండియా వచ్చేస్తున్న చిత్ర యూనిట్!

నాగచైతన్య, హీరో హీరోయిన్లుగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘’. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో విక్రమ్ కుమార్ రూపొందించిన ‘మనం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి అదే డైరెక్టర్‌తో నాగచైతన్య సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఇటలీతో షూటింగ్ జరుపుకుంటోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు అనుకోని షాక్ తగిలింది. భారతదేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు అన్ని సినిమాల షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ వంటి బడా సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా షూటింగ్‌ వాయిదా వేసుకున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదలను వాయిదా వేసుకొని.. పరిస్థితులు మెరుగైన తర్వాత విడుదల తేదీని వెల్లడిస్తామని ప్రకటించాయి. కానీ, థాంక్యూ మాత్రం ఇటలీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా తమ షూటింగ్‌ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అందకు కారణం లేకపోలేదు. భారతదేశంలో ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలకు పలు దేశాలు నిషేధం విధించాయి. ఇప్పుడు ఈ నిషేధం ఎఫెక్ట్ థాంక్యూ సినిమాపై పడింది. షెడ్యూల్ ప్రకారం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సహా ఇతర నటీనటులు థాంక్యూ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే విమాన రాకపోకలు లేకపోవడంతో.. భారత్ నుంచి ఎవరూ ఇటలీకి వెళ్లే అవకాశం లేదు. ప్రకాశ్ రాజ్‌తో ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కానీ, ఆయన ఇటలీకి చేరుకోలేకపోతుండటంతో.. చిత్ర యూనిట్ షూటింగ్‌ని రద్దు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అక్కడ చేసేదేమీ లేక చిత్ర యూనిట్ ఇండియాకు తిరిగి పయనమవుతున్నారట. దీంతో షూటింగ్‌లు వాయిదా వేసుకున్న సినిమాల లిస్టులో ‘థాంక్యూ’ కూడా చేరిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/334thjZ

No comments:

Post a Comment

'Neena Gupta And I Would Fight A Lot'

'I need to work to find some joy in this life.' from rediff Top Interviews https://ift.tt/6NQ7yYS