
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకొనేందుకు మెగాస్టార్ పాడుపడుతున్నారు. తొలి దశలో లాక్‌డౌన్ విధించిన సమయంలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. ఈ సమయంలో ‘కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)’ని ఏర్పాటు చేసిన చిరంజీవి.. సినీ కార్మికులకు అండగా నిలిచారు. సీసీసీ ద్వారా విరాళాలు సేకరించి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, నగదు తదితర సహాయం అందించారు. ఇప్పటికీ సీసీసీ ద్వారా ఆయన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రెండో దశలో కరోనా మహమ్మారి ప్రజలపై కోరాలు చాచుకొని విరుచుకుపడుతుంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ కొరత, సరైన సమయంలో ప్లాస్మా చికిత్స అందకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తమ ప్లాస్మా దానం చేయాల్సిందిగా.. అధికారులు, వైద్యులు కోరుతున్నారు. ఒకరు ప్లాస్మా దానం చేస్తే.. దాని ద్వారా నలుగురి ప్రాణం కాపాడే అవకాశం ఉంది. ఈ క్రమంలో చిరంజీవి కూడా తన ఫ్యాన్స్‌ని ప్లాస్మా దానం చేయాలంటూ కోరారు.. ‘సెకండ్ వేవ్‌లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతున్నారని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్లాస్మా కొరత వలన చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకొనేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయం ఇది. మీరు కరోనా నుండి కొద్ది రోజుల ముందే రికవర్ అయినట్లైతే.. మీ ప్లాస్మా దానం చేయండి. దీని వల్ల ఇంకో నలుగురు కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను’ అంటూ తన సూపర్ హిట్ సినిమా ‘స్టాలిన్’ స్టైల్‌లో మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇక చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్‌కి హీరోయిన్‌గా పూజా హెగ్డే చేస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాట సినిమాపై హైప్‌ను పెంచేశాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vvQurw
No comments:
Post a Comment