Monday, 3 May 2021

‘అవి కొత్త అనుభవాన్ని, సంతృప్తినిచ్చాయి.. నేను ఊహించలేదు..’ ప్రగ్యా లేటెస్ట్ కామెంట్స్

వరుణ్ తేజ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ . సూపర్ హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ భామకి ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా కలిసి రాలేదు. ఇక చేసేదేమీ లేక కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక సోషల్‌మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటోషూట్‌లు నిర్వహిస్తే.. తన అందచందాలతో ఫ్యాన్స్‌ని కట్టిపడేస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రగ్యా అందాల ఆరబోత కాస్త పెంచేసింది కూడా. దీంతో కుర్రాళ్లంతా ఆమె ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. తన ఊహించినట్లు కాకుండా.. తన సినిమా ప్రయాణం విభిన్నంగా సాగుతోందని ప్రగ్యా లేటెస్ట్‌గా పేర్కొంది. ఏమాత్రం అంచనాలు పెట్టుకొని పాత్రలు ఎక్కువ తృప్తినిస్తాయని.. ఇంకా బాధ్యతని పెంచుతాయని చెబుతోంది ప్రగ్యా. ‘కెరీర్ ఆరంభంలో టాప్ యాక్టర్లు, డైరెక్టర్లతో పని చేయాలని అనుకొనే దాన్ని. కానీ, ఆ తర్వాత నేను ఊహించకుండా విభిన్నమైన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అవి మరో రకమైన కొత్త అనుభవాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. ఇప్పుడు నా ఆలోచనల్లోని పరిణతి, అనుభవం ప్రతి రోజునీ మరింత పరిపూర్ణంగా ఆస్వాదించేందుకు కారణం అవుతున్నాయి’ అని పేర్కొంది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ప్రగ్యా తన ఆశలు అన్నీ.. ఈ సినిమాపైనే పెట్టుకుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు ప్రగ్యా ప్రయత్నాలు చేస్తోంది. మరి ప్రగ్యాకు ఏ రేంజ్‌లో కలిసోస్తుందో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eNpJrN

No comments:

Post a Comment

'If Border Is Anyone's, It Is Sunny Uncle's'

'Sunny sir keeps me distracted from my morning sickness.' from rediff Top Interviews https://ift.tt/iVYDNWm