Saturday 24 April 2021

శ్రీరెడ్డి భవిష్యవాణి.. ఈసారి ‘అల్లు’ ఫ్యామిలీ.. అతని కెరీర్ క్లోజ్ అట!

వివాదాస్పద పోస్ట్‌లతో వార్తల్లో నిలిచే .. దగ్గుబాటి వారసుడిని ముప్పుతిప్పలు పెట్టింది. అతన్నే కాదు తనతో కాంటాక్ట్ అయిన తెలుగు, తమిళ ఇండస్ట్రీ ప్రముఖులతో సాగించిన కార్యకలాపాలను బట్టబయలు చేసి వాళ్ల పరువు తీసి పారేసింది. ఈ లిస్ట్‌లో చాలామంది ప్రముఖులు ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్‌ని విమర్శించనిదే రోజు గడవదు అన్నట్టుగా తరచూ ఆయన్ని ఆయన పార్టీని ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు చేస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం శ్రీరెడ్డి ‘అల్లు’ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఆ ఫ్యామిలీ గురించి భవిష్యవాణి చెప్తూ ‘అల్లుగాడి’ కెరియర్ క్లోజ్ అవ్వబోతుందంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది. పైగా తన సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంటూ ఈ పోస్ట్ పెట్టడం విశేషం. ‘అల్లుగాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ.. నాకేం కోపం లేదురా వాడంటే కానీ ఎందుకో ఇలా అనిపిస్తుంది రా మరి.. తప్పుగా అనుకోకండి.. జాగ్రత్త #srireddybhavishyavani’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇంతకీ ఈమె భవిష్యవాణిలో నుంచి ఎవర్ని టార్గెట్ చేసింది.. నిర్మాత గురించా?? లేక హీరో గురించా అని తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dKc5GL

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...