Wednesday, 28 April 2021

సినిమా రౌండప్: రమ్యకృష్ణ సెకండ్ డోస్.. నయనతార డేరింగ్.. అజయ్ దేవ్‌గణ్ ఆపన్న హస్తం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు దాని నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. యంగ్ హీరోయిన్ ప్యాకప్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ప్యాకప్‌ చెప్పేసింది. ఈ మేరకు స్టైల్‌గా నడుస్తున్న పిక్ షేర్ చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. డేరింగ్ అంతా కరోనాకు భయపడి షూటింగ్స్ రద్దు చేస్తుంటే రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకుంది నయనతార. కరోనా పరిస్థితుల్లో కూడా ఆమె హైదరాబాద్ ల్యాండ్ కావడం నిజంగా డేర్ అంటున్నారు నెటిజన్స్. రూటు మార్చిన సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీలు రూటు మార్చారు. ప్రమోషన్‌ కన్నా ప్రజా సేవే మిన్న అని మూకుమ్మడిగా ముందుకు కదులుతున్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్‌, హాస్పిటల్ బెడ్స్‌, ప్లాస్మా తదితర విషయాల కోసం మాత్రమే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడుతున్నారు. ఆపన్న హస్తం కరోనా మహమ్మారి విలయతాండవంలో మీకు మేము అండగా నిలుస్తాం అంటూ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ తన ఎన్‌వై ఫౌండేషన్స్ ద్వారా ముంబై లోని శివాజీ పార్క్‌లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aQs04i

No comments:

Post a Comment

'Nitishji Doesn't Need Certificate For His Politics'

'Muslims in Bihar under Nitishji's rule are safest than anywhere else.' from rediff Top Interviews https://ift.tt/Ct5Tbem