దేశంలో కరోనా దాడి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ఉదృతికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. దీంతో ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ వాయిదా పడగా, ఇంకొన్ని సినిమాల విడుదల కూడా పోస్ట్ పోనే అయింది. తాజాగా ఈ లిస్టులో మెగాస్టార్ లేటెస్ట్ మూవీ 'ఆచార్య' కూడా చేరిపోయింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. 'ఆచార్య' మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి- కొరటాల కాంబోలో సినిమా అనగానే మెగా అభిమానుల్లో ఆతృత నెలకొంది. పైగా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవిని వెండితెరపై చూడాలని ప్రేక్షకుల్లో కుతూహలం మొదలైంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. అందుకోసం చిత్రానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఒక్కసారిగా పెరగడంతో సినిమా విడుదల వాయిదా వేయకతప్పలేదు. ఈ సినిమాను రిలీజ్ వాయిదా వేశామని, ముందుగా చెప్పినట్లుగా మే 14వ తేదీన రిలీజ్ చేయడం లేదని అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది చిత్రయూనిట్. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. ఇది మెగా అభిమానుల్లో కాస్త నిరాశ నింపినా.. కొత్త రిలీజ్ డేట్ చిరంజీవి పుట్టిన రోజే అనగా (ఆగస్టు 22) అని తెలుస్తుండటం వారిలో ఆనందం నింపుతోంది. చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. సిద్ద పాత్రలో ఆయన నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి జోడిగా కాజల్ అగర్వాల్ ఆడిపాడుతోంది. ఇప్పటికే విడుదలైన 'ఆచార్య' అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. సో.. చూడాలి మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32QKZYd
No comments:
Post a Comment