Tuesday, 27 April 2021

అతనితో రాశి ఖన్నా ముద్దులాట.. ఇది ప్యూర్ లవ్ అంటూ ఓపెన్ కామెంట్స్.. వీడియో వైరల్

ఈ మధ్యకాలంలో అందాల సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ పోస్టులు పెడుతోంది. ఒకప్పుడు బొద్దుగుమ్మగా చెప్పుకునే ఈమె స్లిమ్ లుక్ లోకి మారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్న రాశీ.. తాజాగా 'ప్యూర్ లవ్' అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన మేనల్లుడు నీల్‌తో ముద్దులాటలో మునిగితేలుతూ ‘నిజమైన ప్రేమంటే ఇదే’ అని పేర్కొంది రాశి ఖన్నా. ఈ మేరకు సదరు వీడియోను షేర్ చేస్తూ అతనిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసి రాశీ అభిమానులు మురిసిపోతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. తన కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులపై ఆమె చూపిస్తున్న ప్రేమను కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. వరుస సినిమాలతో జోష్‌లో రాశి ఖన్నా.. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతోంది. టాలీవుడ్‌లో గోపీచంద్- మారుతి కాంబోలో రాబోతోన్న 'పక్కా కమర్షియల్' సినిమాలో, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ నాగ చైతన్య హీరోగా రాబోతున్న 'థాంక్యూ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు హిందీలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌గా చేస్తూనే.. తమిళంలో కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్‌’ చిత్రానికి ఓకే చెప్పింది. కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా మలయాళ నటి రజిషా విజయన్‌ నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sYfpT1

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...