ప్రపంచం మొత్తం కరోనా విషపు కోరల్లో చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా నిరుపేదలు, కూలీలు చేయడానికి పని లేక, సరైన ఆహారం దొరక్కా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు తమలోని మానవత్వాన్ని నిద్రలేపుతున్నారు. తమకు తోచినంతలో ఎదుటివారికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆహారం దొరక్క ఇబ్బందిపడ్డ వారికి ఎందరో తమ సొంత ఖర్చుతో ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వారిపై సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిశాయి. అయితే పరిస్థితులు మామూలు మారాయి అని అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా విజృంభించింది. ప్రతీ రోజు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. పలు సంస్థలు, వ్యాపారాలు కరోనా కారణంగా మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. ఈ దశలో మరోసారి ఆహారం ఇబ్బందులు పడేవారి సంఖ్య మరోసారి పెరిగిపోయింది. అయితే గతంలోలానే ఎందరో మంచి మనస్సు ఉన్న వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారం అందిస్తున్నారు. ఇలా ఓ వృద్ధురాళికి ఓ యువకుడు ఆహారం, నీళ్లు అందిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోలో సదరు యువకుడు రోడ్డు పక్కన ఉన్న వృద్ధురాలికి ఆహారంతో పాటు తాగు నీరు ఇస్తాడు. తన ఆకలి తీర్చినందుకు ఆనందంతో ఆ వృద్ధురాలు ఆ యువకుడికి తన వద్ద ఉన్న డబ్బుని ఇవ్వబోతుంది. దానికి ఆ యువకుడు నిరాకరిస్తాడు. దీంతో ఆమె కళ్లలో కనిపించే ఆనందం ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. అయితే ఈ వీడియోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. ‘ఈ వీడియో చూసి నా గుండె పగిలిపోయింది. ఒక వృద్ధాశ్రమం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దేవుడు కరుణిస్తే.. దాన్ని త్వరగా పూర్తి చేస్తా. ఇది రాస్తున్న సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. దయచేసి ఎవరూ ఆహారం వృధా చేయకండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి’’ అంటూ థమన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇటీవల వకీల్‌సాబ్ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న థమన్ ప్రస్తుతం ‘ఆఖండ’, ‘సర్కారు వారి పాట’, ‘గని’ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aDcn08
No comments:
Post a Comment