Wednesday, 28 April 2021

Pawan Kalyan: హరి హర వీరమల్లుపై అనుమానాలు.. ఇదే జరిగితే పవన్ ఫ్యాన్స్‌కి పండగే పండగ!!

రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి ''. జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి పెరగడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వీరవిహారం చేస్తుండటంతో పలు సినిమాల షూటింగ్స్ స్వచ్ఛందంగా వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాల విడుదల తేదీలను సైతం మార్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా కూడా వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ''అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమా తెరపైకి వస్తుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తారు డైరెక్టర్ క్రిష్‌. పైగా సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ మూవీ రిలీజ్ గురించి అనుమానాలు అవసరం లేదు'' అని ఆయన చెప్పారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో.. చెప్పినట్లుగా సంక్రాంతికే సినిమా రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్‌కి ఇక పండగే పండగ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dZpESQ

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...