Thursday, 29 April 2021

హీరోయన్‌‌ని ఫిక్స్ చేసిన శంకర్.. రామ్ చరణ్‌తో మరోసారి జతకట్టనున్న బాలీవుడ్ భామ

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌‌‌లో సినిమా గురించి ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, పెద్ద సెట్టింగ్‌లు మాత్రమే కాదు.. ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. ఇప్పడు రామ్ చరణ్‌తో చేసే సినిమాని కూడా ఓ సందేశాత్మక చిత్రంగా రూపొందించే పనిలో ఉన్నారట శంకర్. శివాజీ, భారతీయుడు స్టైల్‌లో అవినీతిపై యుద్ధం చేసే పాత్రలో రామ్ చరణ్‌ని చూపించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య.. ఈ మే 14న విడుదల కావాల్సింది. కానీ, రెండో దశలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాలో చరణ్ అవినీతిపై పోరాటం చేసే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా అడ్వాణీని శంకర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కియారా మళ్లీ టాలీవుడ్ పైపు చూడలేదు. అయితే శంకర్ చెప్పిన స్క్రీప్ట్ నచ్చడంతో కియారా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అదిరిపోయే డైలాగ్స్ కోసం ప్రముఖ రచయిత వివేక్‌ని రంగంలోని దింపారట శంకర్. గతంలో మెర్సల్, దర్బార్, బిగిల్, ఇరంబు థిరై, సోరారై పొట్రూ తదితర సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. ఈ సినిమాకి కూడా మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించేందుకు శంకర్‌తో పాటు వివేక్ ఇప్పటికే పని ప్రారంభించారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32ZsbGo

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...