Tuesday, 27 April 2021

Happy Birthday Samantha: పెళ్లయితేనేం తగ్గేదే లే..! అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా అందాల అక్కినేని కోడలిదే హవా

Samantha Akkineni: ఏప్రిల్ 28వ తేదీ 1987 సంవత్సరంలో జన్మించిన నేడు తన 34వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమాలో నటించిన నాగచైతన్యనే ప్రేమించి పెళ్లాడి ప్రస్తుతం అక్కినేని కోడలిగా సత్తా చాటుతోంది సమంత. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతుంటారు. కానీ తాను అందుకు భిన్నం అని నిరూపించుకుంటూ అక్కినేని కోడలయ్యాక తన హవా మరింత పెంచింది సమంత. ఇటు స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికే ఉన్న ఫేమ్‌కి అక్కినేని మార్క్ యాడ్ చేసి దూసుకుపోతోంది. అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా సరే తగ్గేదే లే.. అంటూ సమంత చూపిస్తున్న జోష్ ఎంతోమంది హీరోయిన్స్‌కి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వృత్తిపరంగా హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తూనే మంచి మనసున్న అమ్మాయిగా కూడా పలువురి చేత భేష్ అనిపించుకుంటోంది ఈ అక్కినేని కోడలు. సామాజిక కోణంలో ఆలోచించి సాటి మనిషికి సాయపడాలనే దృక్పథంతో 'ప్రత్యూష సపోర్ట్' అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించి ముందుకు సాగుతోంది సామ్. ఈ సంస్థ ద్వారా బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఇక సమంత సినిమాల గురించి ప్రత్యేకమైన వివరణ అవసరమే లేదు. పెళ్లయ్యాక రెట్టింపు ఉత్సాహంతో కెమెరా ముందు ఆడిపాడుతున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఒలకబోయడంలోనూ వెనకడుగేయడం లేదు. ప్రస్తుతం 'శాకుంతలం' సినిమాతో బిజీగా ఉంది సమంత. తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోంది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేయడంలోనూ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ అక్కినేని అభిమానులకు టచ్‌లో ఉండటం అమ్మడి నైజం. అదేవిధంగా తన అందాలతో ఆన్‌లైన్ వేదికలను వేడెక్కించడంలోనూ సమంత రూటే సపరేటు. బుల్లితెరపై హోస్ట్‌గా కూడా తన సత్తా ఏంటనేది ప్రూవ్ చేసుకుంది సమంత. బిగ్ బాస్ తెరపై కొద్దిరోజుల పాటు అక్కినేని నాగార్జునను రీప్లేస్ చేసి హంగామా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'సామ్ జామ్' అంటూ టాప్ సెలబ్రిటీలందరితో ఎంజాయ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈ షోతో సమంత హోస్టింగ్ కళ బయటపడటమే గాక పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ఇలా సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్‌ రౌండ్ ప్రతిభ చూపుతున్న అక్కినేని కోడలు.. ఇటీవలే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. . 'సాకీ' పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం తన బిడ్డ లాంటిది అని సమంత చెప్పడం విశేషం. అలాగే తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సమంత. అంటే ఒక్కటేమిటి అన్ని రంగాల్లో సత్తా చాటే స్టామినా ఉందని ఆమె నిరూపించుకుంటోంది సామ్. ఈ అక్కినేని కోడలు ఇంకా మరెన్నో సరికొత్త అడుగులేస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ 'తెలుగు సమయం' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t2qdzs

No comments:

Post a Comment

'Nitishji Doesn't Need Certificate For His Politics'

'Muslims in Bihar under Nitishji's rule are safest than anywhere else.' from rediff Top Interviews https://ift.tt/Ct5Tbem