Thursday, 29 April 2021

సినిమా రౌండప్: హాట్‌ హాట్‌గా ఎన్టీఆర్‌ హీరోయిన్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ రెడీ! ప్రియాంక ఆవేదన

జోష్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..' అనే డైలాగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లుతోంది. ఇప్పటికే 'అఖండ' టీజర్‌ టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఊపేసిన హీరోయిన్ మరోసారి హాట్‌గా.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా గుర్తుందిగా. డెబ్యూ మూవీతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ మళ్ళీ ఇన్నేళ్లకు మరింత హాట్‌గా వెండితెరపై కనిపించబోతోంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ! రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిటవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓకే చేశారని తెలుస్తోంది. మహేష్ బాబుతో 'మహర్షి' రూపొందించిన వంశీ పైడిపల్లి పవన్ కోసం బలమైన కథ రెడీ చేసి దిల్ రాజుకు వినిపించారట. అతిత్వరలో దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్. అది చూసి ప్రియాంక ఆవేదన కరోనా సెకండ్ వేవ్ దాటికి భారత దేశం అల్లాడిపోతోంది. కోవిడ్ భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఆసుపత్రులలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భారత్ తన సొంత దేశమని, ఇప్పుడు రక్తమోడుతోందని ప్రియాంక ఆవేదన చెందారు. హిట్ సీక్వెల్‌తో మాస్ మహారాజా.. ఇటీవలే 'క్రాక్' సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' మూవీ చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట మాస్ మహారాజ్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సీక్వల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nxywSK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....