Sunday, 25 April 2021

ఆ దర్శకుడి సినిమాతోనే రానా సోదరుడి ఎంట్రీ.. సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా

దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో త్వరలో టాలీవుడ్‌‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వెంకటేశ్, రానా తర్వాత రానా సోదరుడు అభిరామ్ హీరోగా త్వరలో పరిచయం అవ్వనున్నాడు. అయితే అభిరామ్ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేయాలని భావిస్తున్నారట సురేశ్ బాబు. అందుకోసం తొలి సినిమానే మంచి దర్శకుడితో చేయాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో ప్రారంభించారు. ఇందుకోసం వంశీ, తరుణ్ భాస్కర్, రవిబాబులతో చర్చలు జరిపారట. కానీ, ఇవేవీ అనుకూలంగా అనిపించకపోవడంతో.. తేజ డైరెక్షన్‌లో అభిరామ్‌ను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. డైరెక్షన్‌లో రానా ‘నేనే రాజు నేను మంత్రి’ అనే సినిమాలో నటించాడు. అప్పటివరకూ రానాపై ఉన్న ఇమేజ్‌ని తేజా ఈ సినిమాతో పూర్తిగా మార్చేశారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రానా నటనకు ప్రత్యేక ప్రశంసలు కూడా లభించాయి. ఇక నూతన నటీనటులతో సినిమాలు తీసి సూపర్ హిట్ సాధించడంలో తేజా ఎక్స్‌పర్ట్. తేజా డైరెక్షన్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోలు తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో అభిరామ్ ఎంట్రీకి తేజానే సరైన వ్యక్తి అని సురేశ్ బాబు భావిస్తున్నారట. అయితే ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ.పట్నాయక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తేజా, ఆర్‌.పీ.పట్నాయక్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్.పీ.పట్నాయక్ మాట్లాడుతూ.. తన రీ ఎంట్రీని నిర్ధారించారు. అయితే అది తేజా సినిమాతోనే అని ఆయన చెప్పలేదు. కానీ, అభిరామ్‌ని తేజా పరిచయం చేస్తున్న సినిమాతోనే ఆర్.పీ రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఫిలిమ్ నగర్‌లో బలంగా వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tQy8Rv

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...