Monday 26 April 2021

ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించేవి ఆ రెండే.. సమంత సలహాలు మామూలుగా లేవు!

అక్కినేని కోడలు జోరు మామూలుగా లేదు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న సమంత.. యాడ్స్ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారు. సినిమాలకంటే ఎక్కువగా ఇప్పుడు యాడ్స్‌లోనే నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఆమె యాడ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలు ఓ వైపు, తన వ్యాపారం మరో వైపు, ఇలా ప్రకటనల్లో ఇంకో వైపు నటిస్తూ నిత్యం బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఎంతో మందిప్రాణాలు గాల్లో కలిసిపోతోన్నాయి. కొందరు భయంతోనే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు సమంత రెండింటిని మనసులో ఉంచమని సలహా ఇచ్చారు. ఆశ (హోప్), పాజిటివిటీని అనే రెండింటిని మనదగ్గర ఉంచుకుంటే ఈ కష్టకాలం నుంచి బయటపడగలం. ఓజీవి న్యూట్రిషన్ వల్ల నా ఆరోగ్యం, నా నిరోధక శక్తిని పెంచుకుంటున్నాను. మంచి పోషకాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. నా ఫ్యామిలీ, నా అభిమానులు అందరూ కూడా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. మానసికంగా శారీరకంగా ధృడంగా ఉండాలని ఆశిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో న్యూట్రిషన్ ఉండటం, నాకు కావాల్సిన పోషకాలు అందిస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడటం ఎంతో సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చారు. సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, తమిళంలో కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాలను చేస్తోన్నారు. ఇక ఫ్యామిలీమెన్ సీజన్ 2 విడుదలకు రెడీగా ఉంది. ఆ మధ్య వదిలిన టీజర్‌లో సమంత ఒక్క షాట్‌లోనే కనిపించి మెప్పించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vxm7kL

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz