Friday, 30 April 2021

ఇంట్లోనే ఫ్రెండ్‌తో ప్రగతి రచ్చ.. హాట్ హాట్‌గా ఇద్దరూ కలిసి రెచ్చిపోయారు బాబోయ్! వీడియో వైరల్

యాక్ట్రెస్ .. ఈ సినీ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. సినిమాల్లో ఎంత పాపులారిటీ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా ఫేమ్ కూడగట్టుకుంది. ఈ మధ్యకాలంలో కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నాయి. హాట్ హాట్‌గా చిందులేస్తూ ఆయా వీడియోలతో రచ్చ చేస్తోంది ప్రగతి. దీంతో యువత చూపంతా ఈ నటీమణి సోషల్ మీడియా వాల్ పైనే ఉంటోంది. ఇప్పటికే చాలాసార్లు తన డాన్స్ వీడియోలతో స్పెషల్ కిక్కిచ్చిన ప్రగతి.. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తూ రచ్చ చేసింది. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తనదైన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ వీడియోలో ప్రగతి ఫ్రెండ్ కూడా ఆమెతో కలిసి చిందులేసింది. డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు ఈ ఇద్దరూ కలిసి ఇంట్లోనే రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఫాస్ట్ మూమెంట్స్‌కి తోడు ఇద్దరి గ్లామర్ డోస్ ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణమైంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి ప్రగతి చేస్తున్న హంగామా చూసి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆమె ఎనర్జీ, డాన్సింగ్ స్కిల్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా, క్లాసికల్ డాన్స్ వేయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ సోషల్ మీడియాను దున్నేస్తోంది ఈ సీనియర్ నటి. లేటు వయసులో ఘాటు అందాలతో మత్తెక్కిస్తుండటంతో ప్రగతికి సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆమె గ్రేస్ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు. ఇలా సామజిక మాధ్యమాల ద్వారా రెగ్యులర్‌గా హాట్ ట్రీట్ ఇవ్వడం హాబీగా పెట్టుకుంది ప్రగతి. ఏదేమైనా వెండితెరపై ఎంతో పద్దతిగా అమ్మ, అక్క, వదిన పాత్రల్లో కలిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SjFnUx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....