టాలీవుడ్ ప్రముఖ నటుడు మరణాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. పొట్టి వీరయ్య గురించి తెలిసిన ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం నాడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అనారోగ్యం బారిన పడిన వీరయ్య.. నిన్న కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం నెలకొంది. మరగుజ్జుగా ఎన్నో పాత్రల్లో కనిపించి మెప్పించారు. నాటి తరం హీరోల సినిమాల్లో పొట్టి వీరయ్య అనేక వేషాలు వేశారు. పొట్టి వీరయ్య సొంత జిల్లా నల్గొండ. అగ్గివీరుడు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు. ఇక పొట్టి వీరయ్య మరణ వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ప్రముఖ సినీ హాస్య నటుడు శ్రీ పొట్టి వీరయ్య మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారన్నారు. శ్రీ వీరయ్య కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక మామూలుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. కానీ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రియాక్ట్ అవుతుంటారు. పొట్టి వీరయ్య మరణంతో ఉదయ భాను కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి చేత కన్నీరు పెట్టించేలా ఉంది. వీరయ్య అంకుల్ మరణ వార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజం.. చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. నాకు ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతోన్నా.. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్.. ఎంతో మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద కొంచెమైనా దయచూపు అంటూ ఉదయ భాను ఎమోషనల్ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32OudZS
No comments:
Post a Comment