Sunday, 25 April 2021

అందుకే రాజు కంటే హీరో గొప్పవాడు.. పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లను ఎవ్వరైనా టార్గెట్ చేసి మాట్లాడారంటే వారి తాట తీసేందుకు నాగబాబు రెడీగా ఉంటారు. మెగా అభిమానులకు నిత్యం టచ్‌లో ఉండేది నాగబాబు మాత్రమే. నాగబాబు మాటలను మెగా ఫ్యాన్స్ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కంట్రోల్ చేయడంలో, రెచ్చగొట్టడంలో నాగబాబు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఈ మధ్య నాగబాబు కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారు. మొన్నీ మధ్య బాబు గోగినేని కామెంట్లపై ఘాటుగా స్పందించారు. నాకు నా పెంపుడు కుక్కల మీదే ఇంట్రెస్ట్ ఉంది ఆయన మీద లేదంటూ ఘోరంగా అవమానించారు. ఆయన కూడా రివర్స్‌లో నాగబాబును దారుణంగా ఏకిపారేశారు. అలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో నాగబాబు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. మామూలుగా నాగబాబు ఇప్పుడు జనసేన కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. గత ఏడాది నాగబాబు గాడ్సే, గాంధీ, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మలే ఎందుకు అని ప్రశ్నించడంతో జనసేనకు కాస్త డ్యామేజీ జరిగింది. అప్పటి నుంచి జనసేన అధికారికంగా కాస్త దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరైనా విమర్శిస్తే మాత్రం నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అంతెత్తున లేస్తారు. తాజాగా తన తమ్ముడు గురించి ఓ కొటేషన్ చెప్పుకొచ్చారు. రాజుకు, హీరోకు మధ్య ఉన్న తేడాను చెబుతూ పవన్ కళ్యాణ్ కింగ్‌కంటే గొప్ప అని తెలిపారు. రాజు కేవలం తన పదవి, రాజ్యం మాత్రమే ఆలోచిస్తారని, పోరాడుతాడని, హీరో మాత్రం అందరి గురించి పోరాడుతాడని అది నువ్వే అంటూ పవన్ కళ్యాణ్‌ గురించి చెప్పుకొచ్చారు. ఒక హీరో రాజు చేసే దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలుస్తాడు. గెలుపొటముల గురించి ఆలోచించకుండా ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఫాం హౌస్‌లో ఐసోలేట్ అయిన పవన్ కళ్యాణ్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇంకా కొన్ని రోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32KGE8L

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...