దర్శకత్వంలో మెగాస్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘’. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా టీజర్, ఓ పాట విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండో దశలో కరోనా కేసుల సంఖ్య ఆకాశాన్ని తాకుతోంది. రోజులు లక్షల సంఖ్యలో పాజివిట్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో దేశంలో పరిస్థితులు అతలాకుతలంగా మారాయి. ఈసారి వైరస్ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పలువు సినిమాలు షూటింగ్‌లు రద్దు చేసుకోగా.. పలు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆచార్య సినిమాకు ఎదురయ్యే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. ప్రజలు బయటకు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు. దీంతో సినిమాను మే 14 నుంచి వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. సినిమాలో ఇంకా ఒకటి రెండు సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే పరిస్థితులు కాస్త మెరుగైన తర్వాత షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు పుట్టినరోజున ఆయన సినిమా విడుదల అయితే అది మెగా అభిమానులకు పండగే అవుతోంది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అతనికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u4SYwZ
No comments:
Post a Comment