Tuesday, 27 April 2021

సమంత సీక్రెట్ నేమ్ రివీల్.. ఇంట్లో వాళ్లంతా పిలిచే పేరిదే! వెరీ వెరీ ఇంట్రెస్టింగ్..

ఈ లోకంలో ఎంతోమంది ముద్దు పేర్లతో పిలవబడుతుంటారు. బయట ఓ పేరుతో ఫేమస్ అయినా కూడా వారి వారి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు మరొకటి ఉంటుంది. ఇది ఒరిజినల్ నేమ్‌కి కాస్త దగ్గరగా ఉండటం కామన్. అయితే స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంది. తాజాగా ఆమె సీక్రెట్ నేమ్ రివీల్ అయింది. మనమంతా సామ్ అంటూ ముద్దుగా పిలుచుకునే సమంతను ఇంట్లోవాళ్ళు మాత్రం 'యశోద' అని పిలుస్తారట. ఆమె సన్నిహితులు కూడా అదే పేరుతో పిలుస్తుంటారని తెలిసింది. అంతేకాదు సమంతకు అలా అని పిలిపించుకోవడం కూడా చాలా చాలా ఇష్టమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా ఈ సీక్రెట్ నేమ్ గురించి తెలిసి సామ్ ఫ్యాన్స్ కూడా కాస్త కొత్తగా ఫీల్ అవుతున్నారు. సినిమాల్లోకి రాకముందు సమంత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదట. అలా పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ రంగంలోకి వచ్చిన సమంతను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఓ యాడ్‌ షూట్‌లో సమంతని చూసిన డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ 'ఏ మాయ చేశావే' సినిమాలో అవకాశం ఇవ్వడంతో ఆమె అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ పీక్ స్టేజిలో ఉండగా అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. పెళ్లి తర్వాత కూడా వెండితెరపై హవా నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది సామ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R5YLn2

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...