Friday, 30 April 2021

‘వకీల్‌సాబ్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా.. వేణు శ్రీరామ్ నువ్వు మామూలోడివి కాదు!

రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. మళ్లీ ‘’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ని ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో చూసి.. అభిమానులు పండుగ చేసుకున్నారు. స్వతహాగా పవన్‌కళ్యాణ్ అభిమాని అయిన వేణు శ్రీరామ్ ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని ఎలా చూపించాలో సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని అలాగే చూపించాడు. పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్లు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అందించాడు. మాస్ యాంగిల్‌లో ఓ రేంజ్ ఎలివేషన్లతో పవర్‌స్టార్‌ రీఎంట్రీ అదిరిపోయేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వకీల్‌సాబ్’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ టైటిల్ కార్డు. ఇంతకు ముందు పవన్‌కళ్యాణ్ సినిమాల్లో ఆయన టైటిల్ కార్డు మామూలుగానే ఉండేది. కానీ, వకీల్‌సాబ్ సినిమాలో మాత్రం పంచభూతాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి.. ఆ తర్వాత పవర్‌స్టార్ అని వచ్చేలా టైటిల్‌కార్డును డిజైన్ చేయించాడు వేణు శ్రీరామ్. ఇప్పుడు ఈ పంచభూతాల కాన్సెప్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు ‘వేణు శ్రీరామ్.. నువ్వు మామూలోడివి కాదు.. నీ ఆలోచనకి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xO5wuS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....