Monday, 26 April 2021

ఫాంహౌస్‌లో పూనమ్ కౌర్ అంటూ నెటిజన్ సెటైర్.. చీప్ క్యారెక్టర్.. చిర్రెత్తిపోయిన పూనమ్ కౌర్

సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఒక్కోసారి ఆమె వేసే పోస్ట్‌లు ఎవరిని ఉద్దేశిస్తున్నాయో చెప్పడం కష్టం. ఇంకొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు వేస్తుంటారు.. మరొకొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను మాత్రం టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతటి ట్రోలింగ్‌కు గురవుతుందో అందరికీ తెలిసిందే. పెయిడ్ మీడియా అంటూ తన మీద తప్పుడు వార్తలు రాసే వారిని ఏకిపారేస్తుంటారు. ప్రతీసారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభ సమయంలో పూనమ్ కౌర్ పేరును వార్తల్లోకి లాగుతుంటారు. బిగ్ బాస్‌లోకి వచ్చేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తోందని, కానీ బిగ్ బాస్ టీం పట్టించుకోవడం లేదని వార్తలు రాసేశారు. అలాంటి తప్పుడు వార్తలపై పూనమ్ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ టీం తనను సంప్రదించింది కానీ తానే ఒప్పుకోవడం లేదని క్లారిటీగా చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రతీసారి పూనమ్ కౌర్‌ను వార్తల్లోకి లాగుతుంటారు. ఇక పూనమ్ కౌర్ అప్పుడప్పుడు నెటిజన్లకు రిప్లైలు ఇస్తుంటారు. పూనమ్ కౌర్ వ్యవహారంపై సోషల్ మీడియాలో నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా పూనమ్ కౌర్ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోకు ఓ నెటిజన్ వింత కామెంట్ పెట్టేశారు. ఆ ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఫాం హౌస్‌లా కనిపిస్తుందే.. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ కానుందా? అని కామెంట్ పెట్టేశాడు. దానికి పూనమ్ కౌర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఆ నెటిజన్‌ను పూనమ్ కౌర్ మాటలతోనే చావగొట్టేశారు. నీ ఆలోచన విధానమే నువ్ ఎంత చీప్ ఎంత మంచివాడివని చెబుతుంది.. ఇలాంటివి రాయమని నిన్ను ఎవరు ఉసిగొల్పారో వారిని ఆధారంగా చేసుకుని నీ బుద్ది ఏంటో చెప్పవచ్చు.. నీ ఆలోచనలో నీ వ్యక్తిత్వాన్ని చెబుతాయ్.. ఇంకా ఆలోచిస్తూనే ఉండు అని పూనమ్ కౌర్ కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడట. అలా ఫౌం హౌస్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు పూనమ్ కౌర్ ఉందని సదరు నెటిజన్ అలాంటి కామెంట్ చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32NcMZt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....