Monday, 26 April 2021

పొట్టి వీరయ్య మృతిపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్.. స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడంటూ!!

టాలీవుడ్ నటుడు పొట్టి వీరయ్య మరణాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. పొట్టి వీరయ్య గురించి తెలిసిన ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్‌‌లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘకాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్త‌ప‌రుస్తూ తెలియ‌జేశారు. మాట్లాడుతూ-``వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను`` అని అన్నారు. సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని.. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్ల‌డించారు. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించార‌ని ఆ ఇంటర్వ్యూలో పొట్టి వీరయ్య తెలిపారు. కుటుంబ సభ్యుల వివ‌రాల ప్ర‌కారం.. ఆయన అంత్యక్రియలు సోమవారం రోజు జరుగుతాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించిన ఆయన దాదాపు 300కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32MoOCi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....