Sunday, 25 April 2021

ఆత్మహత్య చేసుకుంటా.. అభిమాని బెదిరింపులకు విశ్వక్ సేన్‌ షాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మీద ఎంతటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందో.. అంతే స్థాయిలో పాజిటివిటీ కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండను ఎందుకు ఫాలో అవుతుంటావ్ అని నెట్టింట్లో ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు. విశ్వక్ సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. ఫలక్ నుమా దాస్ అనే సినిమాతో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నారు. HIT సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కేశారు. అలా ఇప్పుడు విశ్వక్ సేన్ తన రూట్ మార్చేశారు. మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశ్వక్ ఇప్పుడు లవర్ బాయ్‌గా మారిపోయేందుకు రెడీగా ఉన్నారు. సినిమాతో విశ్వక్ సేన్ ప్రేమ కథా చిత్రంతో కొత్తగా కనిపించబోతోన్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. పాగల్ అనే టైటిల్ విశ్వక్ సేన్‌కు కరెక్ట‌గా సూట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు పెట్టేశారు. తాజాగా విశ్వక్ సేన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశారు. అందులో తన ఫాలోవర్లు అడిగిన వింత వింత ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధానాలు పెట్టేశారు. ఇంకా కొంత మంది తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని అలిగిపోయారు. హర్ట్ అయ్యామంటూ మళ్లీ కామెంట్లు పెట్టేశారు. అలా అందరి ప్రశ్నలకు విశ్వక్ సేన్ సమాధానాలు ఇస్తూ వెళ్లారు. బిర్యానీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పాగల్ ట్రైలర్ రెడీ అవుతోందని, ఓ మై కడవులే అనే సినిమా రీమేక్ 30 శాతం పూర్తయిందని ఇలా తన సినిమా అప్డేట్ల ప్రశ్నలకు సమాధనాలు ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం విశ్వక్ సేన్‌ను హడలెత్తించాడు. ఎంత సేపటికి విశ్వక్ సేన్ రిప్లై ఇవ్వకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అని హెచ్చరించారు. దీనిపై విశ్వక్ స్పందిస్తూ.. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అని తన స్టైల్లో కౌంటర్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ni80MY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....