Friday 30 April 2021

రూటు మార్చిన పాయల్.. అందాల ఆరబోతకు బ్రేక్.. ఓ డిఫరెంట్‌ రోల్‌లో అలరించేందుకు రెడీ!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోయినా.. ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో స్టార్ హీరోలతో నటించిన.. ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. ఇక సోషల్‌మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్‌లు నిర్వహిస్తూ.. కుర్రకారులో హీటు పుట్టుస్తుంటుంది. మొత్తానికి ఏదో విధంగా సరైన బ్రేక్ సంపాదించాలని పట్టుదలతో ఉంది పంజాబీ బ్యూటీ పాయల్. అయితే అందుకోసం తన రూటు మార్చాలనే యోచనలో పాయల్ ఉన్నట్లు సమాచారం. ఇంతకాలంలో తన అందాలతో ఎంత కనువిందు చేసినా ఛాన్స్‌లు రాలేదు. దీంతో కొంతకాలం ఈ అందాల ఆరబోతకు బ్రేక్ వేసి డిఫరెంట్ మాడ్యులేషన్ ఉండే పాత్రల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం ప్రారంభించిదట. గత ఏడాది లాక్‌డౌన్‌లో ‘అనగనగా ఒక అతిథి’ అనే సినిమాతో పలకరించింది పాయల్. తన కెరీర్‌లో తొలిసారిగా డీగ్లామర్ పాత్రలో కనిపించి.. మెప్పించింది. ప్రముఖ ఓటీటీ ‘’లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడ అదే రూట్‌లో మరోసారి వెళ్లాలని పాయల్ ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం ఆమె ఆహాతో కలిసి మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తోందని టాక్. అయితే తొలిసారిగా ఈ వెబ్‌సిరీస్‌లో పాయల్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ‘’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో పాయల్ పాత్రే హైలైట్‌గా నిలువనుందట. దీంతో ఈ వెబ్‌సిరీస్ తర్వాత పాయల్‌ క్రేజ్ మరో రేంజ్‌కు వెళ్లే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. మరి ఈ వెబ్‌సిరీస్ సక్సెస్ అయితే.. పాయల్ ఇదే రూట్‌లో కొనసాగుతుందో.. లేక మళ్లీ తన స్టైల్‌నే కొనసాగిస్తుందో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33041eC

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz