Wednesday, 28 April 2021

అర్ధరాత్రి వేళ కూతురుతో సురేఖా వాణి రచ్చ.. ఫుల్లుగా ఎంజాయ్! ఆయన ఫొటో ముందు పెట్టుకొని..

సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాను దున్నేస్తూ నేటితరం ఆడియన్స్‌కి కిక్కివ్వడమూ సురేఖా వాణికి తెలుసు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. నిత్యం తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది సురేఖావాణి. ఈ క్రమంలోనే గత రాత్రి ఇంట్లో చేసిన ఎంజాయ్ తాలూకు ఫొటోలు షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 29) తన పుట్టినరోజు సందర్భంగా కూతురు , అత్యంత సన్నిహితులతో కలిసి చిల్ అయింది . కూతురు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజను మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. ఈ మేరకు తన పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేసి ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినందుకు కూతురు సుప్రితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది సురేఖా వాణి. నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదంటూ కామెంట్ చేసింది. దీంతో సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి మనందరికీ తెలుసు. అప్పటినుంచి కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె.. ఇటీవలి కాలంలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. ఇదే విషయమై ఆమె కూతురు సుప్రిత కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదంటూ మీడియాపై మండిపడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QwRjlh

No comments:

Post a Comment

'BC network has to be commercially viable'

'With a very stable technology with limited functionalities, a large network has spanned out.' from rediff Top Interviews https://...